ఆర్టీసీ నిఘా, భద్రతా విభాగం తిరుపతి చీఫ్ సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్ (సీఎస్‌ఐ) సుదర్శన వర్మ (61) బలవన్మరణానికి పాల్పడ్డారు. తిరుపతిలోని డీపీటీవో (జిల్లా ప్రజారవాణాధికారి) కార్యాలయంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. వడమాలపేట మండలం బీరివాని కండ్రిగకు చెందిన సుదర్శన వర్మ.. తిరుపతి సబ్ సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ ఈ ఏడాది ఏప్రిల్‌లో సీఎస్‌ఐగా పదోన్నతి పొందారు.
ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు మే నెలలో సస్పెండ్ చేశారు. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని, సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరుతూ విజయవాడలోని అధికారులను ఆయన పలుమార్లు సంప్రదించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే గురువారం ఉదయం డీపీటీవో కార్యాలయంలో సుదర్శన వర్మ ఉరి వేసుకున్నారు.
కార్యాలయ సిబ్బంది గమనించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అనంతరం కుటుంబ సభ్యులకు విషయం తెలియజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న భార్య మోహన, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. సుదర్శన వర్మ మృతిపై తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఏ తప్పు చేయకపోయినా తన భర్తను సస్పెండ్ చేశారని, విచారణ పేరుతో ఒత్తిడికి గురిచేస్తున్నారనే మనస్తాపంతోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని భార్య మోహన తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సుదర్శన వర్మపై వచ్చిన ఆరోపణలు, సస్పెన్షన్ కారణాలు, ఆయన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















