2029 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మరోసారి అధికారంలోకి వచ్చేలా పనిచేయాలని జర్మనీలోని ఎన్ఆర్ఐ టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. ఈ లక్ష్యంతో ప్రవాసాంధులంతా సమన్వయంతో పనిచేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని నిర్ణయించారు.
జర్మనీలోని నార్త్ రైన్-వెస్ట్‌ఫేలియా రాష్ట్ర ఎన్ఆర్ఐ టీడీపీ సమావేశం డ్యూసెల్డార్ఫ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ అభిమానులు, కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమావేశంలో చర్చించారు.
రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వంటి కీలక ప్రాజెక్టుల పురోగతిని నేతలు ప్రస్తావించారు. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణ పెరుగుతున్న నేపథ్యంలో ఎన్ఆర్ఐలు కూడా ఏపీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
టీడీపీ ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలను జర్మనీలోని తెలుగు ప్రజలకు మరింత విస్తృతంగా చేరవేయాలని సమావేశంలో నిర్ణయించారు. అలాగే సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించి పార్టీకి సంబంధించిన సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని నేతలు పేర్కొన్నారు.
పార్టీ శ్రేణుల మధ్య ఐక్యత, సమన్వయాన్ని మరింత బలోపేతం చేసేందుకు NRW రాష్ట్రంలో టీడీపీ సమావేశాలను తరచుగా నిర్వహించాలని నిర్ణయించారు. కార్యక్రమంలో జర్మనీలోని వివిధ ప్రాంతాలకు చెందిన టీడీపీ ఎన్ఆర్ఐ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రవాసాంధ్రులకు అందుతున్న ఏపీఎన్‌ఆర్‌టీఎస్ సేవలపై కూడా సమావేశంలో అవగాహన కల్పించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















