మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి దంపతులు రైలు కిందపడి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
పోలీసుల వివరాల ప్రకారం, మహబూబాబాద్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపాయిపేట గ్రామానికి చెందిన రవికుమార్, శిరీష్ దంపతులు ఘట్‌కేసర్–బీబీనగర్ రైల్వే మార్గంలోని ఎన్‌ఎఫ్‌సీ సమీపంలో రైలు కిందపడి ప్రాణాలు కోల్పోయారు. ఘటన ఎలా జరిగింది అన్న కోణంలో స్పష్టత రావాల్సి ఉంది.
సమాచారం అందుకున్న సికింద్రాబాద్ రైల్వే పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలనలు జరిపారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది. వీరిద్దరూ ప్రస్తుతం హయత్‌నగర్ సమీపంలోని కుంట్లూరులో నివసిస్తున్నట్లు సమాచారం.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















