ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ (HDFC Bank) రుణగ్రహీతలకు శుభవార్త చెప్పింది. నిధుల ఆధారిత రుణ రేట్లు (MCLR – Marginal Cost of Funds Based Lending Rate)పై బ్యాంకు 10 బేసిస్ పాయింట్ల వరకు తగ్గింపును ప్రకటించింది. ఈ నిర్ణయంతో గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు తీసుకున్న వారికి నెలవారీ ఈఎంఐలు కొంత మేర తగ్గే అవకాశం ఉంది. బ్యాంకు చేసిన ఈ మార్పులు వెంటనే అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది.
ఇంతకుముందు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రుణ కాల పరిమితి ఆధారంగా ఎంసీఎల్ఆర్ రేట్లను 8.25 శాతం నుంచి 8.60 శాతం వరకు వసూలు చేసింది. తాజాగా చేసిన తగ్గింపుతో ఈ వడ్డీ రేట్లు 8.15 శాతం నుంచి 8.55 శాతం వరకు తగ్గాయి. ముఖ్యంగా ఒక నెల కాలపరిమితి ఉన్న రుణాలపై 10 బేసిస్ పాయింట్ల మేర తగ్గించి 8.25 శాతం నుంచి 8.15 శాతానికి తీసుకొచ్చింది.
అదే విధంగా మూడు నెలల కాలపరిమితి ఉన్న రుణాలపై 8.30 శాతం నుంచి 8.25 శాతానికి, ఆరు నెలలు మరియు ఒక సంవత్సరం కాలపరిమితి ఉన్న రుణాలపై 8.40 శాతం నుంచి 8.35 శాతానికి తగ్గించింది. రెండేళ్ల రుణాలపై 8.50 శాతం నుంచి 8.45 శాతానికి, మూడు సంవత్సరాల రుణాలపై 8.60 శాతం నుంచి 8.55 శాతానికి వడ్డీ రేట్లు తగ్గించినట్లు బ్యాంకు తెలిపింది.
ఇక ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) ఖాతాదారులకు కూడా హెచ్‌డీఎఫ్‌సీ మరో శుభవార్త అందించింది. కొన్ని ఎఫ్‌డీ పథకాలపై వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్ల మేర పెంచినట్లు ప్రకటించింది. దీంతో ఒకవైపు రుణగ్రహీతలకు ఈఎంఐ భారము తగ్గుతుండగా, మరోవైపు డిపాజిట్ దారులకు అదనపు లాభం చేకూరనుంది.
బ్యాంకింగ్ రంగంలో తీసుకున్న ఈ నిర్ణయం గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు తీసుకున్న లక్షలాది మంది ఖాతాదారులకు కొంత ఉపశమనాన్ని కలిగించనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Amaravati Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APGovernment APNews APPolitics Breaking news BreakingNews BusinessNews Chandrababu naidu ChandrababuNaidu CrimeNews Entertainment Geopolitics Government India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate NewsUpdates PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews Tdp Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood Toofan TrendingNow WorldNews



















