దేశంలో వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు మరోసారి భారీ వృద్ధిని నమోదు చేశాయి. ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా రూ.1,99,853 కోట్ల జీఎస్‌టీ ఆదాయం సమకూరింది. గతేడాది ఆగస్టులో నమోదైన వసూళ్లతో పోలిస్తే ఈసారి 14.8 శాతం వృద్ధి నమోదైంది. దీంతో నెలవారీ జీఎస్‌టీ వసూళ్లు మరోసారి రూ.2 లక్షల కోట్ల మార్కుకు చేరువయ్యాయి.
దేశీయ లావాదేవీల ద్వారా రూ.1,37,249 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది గతేడాది ఇదే నెలతో పోలిస్తే 9.3 శాతం అధికం. దిగుమతుల ద్వారా వచ్చిన జీఎస్‌టీ ఆదాయం మరింత వేగంగా పెరిగింది. ఈ విభాగంలో రూ.62,604 కోట్ల ఆదాయం సమకూరగా.. వార్షిక ప్రాతిపదికన 29 శాతం వృద్ధి నమోదైంది.
మొత్తం వసూళ్లలో కేంద్ర జీఎస్‌టీ వాటా రూ.38,413 కోట్లు కాగా.. రాష్ట్రాల జీఎస్‌టీ ద్వారా రూ.46,316 కోట్లు సమకూరాయి. ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ వసూళ్లు రూ.1,15,124 కోట్లుగా నమోదయ్యాయి. ఇదే సమయంలో పన్ను చెల్లింపుదారులకు రీఫండ్‌ల రూపంలో రూ.31,795 కోట్లు చెల్లించారు. రీఫండ్‌లలో గతేడాదితో పోలిస్తే 67.9 శాతం పెరుగుదల నమోదైంది.
రీఫండ్‌లను మినహాయించిన తర్వాత నికర జీఎస్‌టీ ఆదాయం రూ.1,68,057 కోట్లుగా ఉంది. గతేడాది ఆగస్టుతో పోలిస్తే నికర వసూళ్లు 8.3 శాతం పెరిగాయి. దేశీయ వినియోగం, ఆర్థిక కార్యకలాపాలు, దిగుమతుల్లో పెరుగుదల జీఎస్‌టీ వసూళ్లకు ప్రధానంగా దోహదం చేసినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.
ఎస్‌జీఎస్‌టీ సెటిల్‌మెంట్ అనంతరం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆగస్టు వరకు తెలంగాణకు రూ.21,885 కోట్ల జీఎస్‌టీ ఆదాయం వచ్చింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 19 శాతం అధికం. ఆంధ్రప్రదేశ్‌కు రూ.16,415 కోట్ల ఆదాయం సమకూరగా.. 18 శాతం వృద్ధి నమోదైంది. దేశవ్యాప్తంగా రాష్ట్రాల సగటు జీఎస్‌టీ ఆదాయం 16 శాతం పెరిగింది.
అయితే ఒక్క ఆగస్టు నెలను పరిశీలిస్తే తెలుగు రాష్ట్రాల మధ్య భిన్నమైన ధోరణి కనిపించింది. తెలంగాణలో రూ.5,343 కోట్ల జీఎస్‌టీ వసూలైంది. గతేడాది ఆగస్టుతో పోలిస్తే ఇది 16 శాతం ఎక్కువ. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో రూ.3,438 కోట్ల జీఎస్‌టీ ఆదాయం నమోదైంది. అయితే ఇది గతేడాది ఆగస్టుతో పోలిస్తే 7 శాతం తక్కువ. దీంతో ఆగస్టు నెల జీఎస్‌టీ వసూళ్లలో తెలంగాణ వృద్ధి సాధించగా.. ఏపీలో ఆదాయం తగ్గింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















