హంటా వైరస్ కలకలం రేపిన క్రూజ్ నౌక MS Oosterdam / Hondius Cruise Ship నుంచి ప్రయాణికులను వారి స్వదేశాలకు తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. పశ్చిమ ఆఫ్రికాలోని టెనెరీఫ్ ద్వీపం వద్ద నిలిచిన ఈ నౌక నుంచి ప్రయాణికులను మొదట చిన్న పడవల ద్వారా తీరానికి తరలిస్తున్నారు.
ఈ నౌకలోని ఇద్దరు భారతీయ సిబ్బందిని ఇప్పటికే నెదర్లాండ్స్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 140 మంది ప్రయాణికుల్లో ఎవరికీ హంటా వైరస్ లక్షణాలు కనిపించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ World Health Organization స్పష్టం చేసింది.WHO డైరెక్టర్ జనరల్ Tedros Adhanom Ghebreyesus మాట్లాడుతూ సాధారణ ప్రజలకు ఈ వైరస్ ప్రమాదం తక్కువేనని మరోసారి తెలిపారు.
స్పెయిన్, అమెరికా, బ్రిటన్, జర్మనీ సహా అనేక దేశాలు తమ పౌరులను తరలించేందుకు ప్రత్యేక విమానాలు పంపుతున్నాయి. నౌకలో మరణించిన ఒక ప్రయాణికుడి మృతదేహం మాత్రం నౌకలోనే ఉంచనున్నట్లు అధికారులు వెల్లడించారు.నౌకను నెదర్లాండ్స్‌లోని రోటర్‌డ్యామ్‌కు తీసుకెళ్లి అక్కడ పూర్తిస్థాయి క్రిమిసంహార చర్యలు చేపట్టనున్నారు. అమెరికా పౌరులను నెబ్రాస్కాలోని వైద్య కేంద్రంలో క్వారంటైన్‌లో ఉంచనున్నట్లు సమాచారం.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















