ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా తన టూవీలర్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించేందుకు సిద్ధమైంది. దేశీయ మార్కెట్‌లోకి ఒకేసారి 10 కొత్త మోడళ్లను ఆవిష్కరించింది. వీటిలో ఏడు పూర్తిగా కొత్త మోడళ్లు కాగా, మరో మూడు ఇప్పటికే ఉన్న మోడళ్లకు అప్‌డేటెడ్ వెర్షన్లు.
స్కూటర్లు, రెట్రో రోడ్‌స్టర్లు, క్రూయిజర్ బైక్స్, అడ్వెంచర్ మోటార్‌సైకిళ్లతో పాటు ఎలక్ట్రిక్, ఫ్లెక్స్ ఫ్యూయల్ ఆప్షన్లను కూడా హోండా పరిచయం చేయనుంది. వీటిని భారతీయ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా స్థానికంగా తయారు చేసి, దశలవారీగా మార్కెట్‌లోకి తీసుకురానుంది.
కొత్త మోడళ్లలో ADV160, CB500, Rebel 300, Rebel 500, XR300L, XR300 ర్యాలీ, QC3 ఈవీ వంటి వాహనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ముఖ్యంగా QC3 ఈవీ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 151 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యంతో రానుంది.
అదే సమయంలో హోండా పరిచయం చేస్తున్న ఇ-క్లచ్ టెక్నాలజీ కూడా ప్రత్యేకంగా నిలుస్తోంది. ట్రాఫిక్‌లో డ్రైవింగ్‌ను సులభతరం చేసేలా క్లచ్ లీవర్‌ను ఆపరేట్ చేయకుండానే గేర్లు మార్చుకునే సదుపాయం ఇందులో ఉంటుంది. కొత్త మోడళ్ల ధరలు, మార్కెట్‌లో అందుబాటు వివరాలను ఆయా వాహనాల లాంచ్ సమయంలో కంపెనీ వెల్లడించనుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















