అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఇంధన మార్కెట్లపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా హర్మూజ్ జలసంధిలో చమురు ట్యాంకర్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటం ఇంధన సరఫరాపై ప్రభావం చూపుతోంది.
ఈ పరిస్థితిపై బ్యాంక్ ఆఫ్ అమెరికా కీలక హెచ్చరిక చేసింది. అమెరికా-ఇరాన్ ఘర్షణలకు పరిష్కారం లభిస్తే బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 70-80 డాలర్ల పరిధిలో ఉండొచ్చని అంచనా వేసింది. అయితే సంక్షోభం కొనసాగితే శీతాకాలంలో ఇంధన ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.
యుద్ధానికి ముందు హర్మూజ్ జలసంధి ద్వారా రోజుకు సుమారు 140 నౌకలు రాకపోకలు సాగించేవి. ప్రస్తుతం ఆ సంఖ్య కేవలం 5 నుంచి 10 నౌకలకు పడిపోయింది. ఇంధన మార్కెట్లు సాధారణ స్థితికి రావాలంటే రోజుకు కనీసం 80 నుంచి 100 నౌకలు హర్మూజ్‌ను దాటాల్సి ఉంటుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా తెలిపింది.
ప్రస్తుతం ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు నిల్వలు సరిపడా ఉన్నప్పటికీ, దాన్ని పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి తుది ఉత్పత్తులుగా మార్చి సరఫరా చేయడంలో సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొంది. దీంతో ముడి చమురు కొరత కంటే తుది ఇంధన ఉత్పత్తుల సరఫరా లోటే ప్రధాన ఆందోళనగా మారింది.
ఇరాన్ కూడా అమెరికాతో చర్చలకు సంబంధించి కఠిన వైఖరి అవలంబిస్తుండటంతో పరిస్థితి మరింత అనిశ్చితంగా మారింది. అమెరికా తమ షరతులను అంగీకరించే వరకు హర్మూజ్ జలసంధిని తెరవబోమని ఇరాన్ స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ పరిణామాలు ప్రపంచ దేశాల్లో ఇంధన భయాలను పెంచుతున్నాయి.
ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు సుమారు 88 డాలర్ల వద్ద, అమెరికా WTI క్రూడ్ సుమారు 82.20 డాలర్ల వద్ద కదులుతున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews
















