స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI)లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న సీఏలకు మంచి అవకాశం వచ్చింది. లఖ్‌నవూకు చెందిన సిడ్బీ కాంట్రాక్ట్ ప్రాతిపదికన మూడేళ్ల కాలానికి 50 కన్సల్టెంట్ క్రెడిట్ అనలిస్ట్ (CCA) పోస్టులను భర్తీ చేయనుంది.
ఈ పోస్టులకు చార్టర్డ్ అకౌంటెంట్ (CA) విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఉద్యోగ అనుభవం తప్పనిసరి కాకపోవడం ఫ్రెషర్స్‌కు ఉపయోగకరమైన అంశం. అభ్యర్థులను విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూకు పిలుస్తారు.
ఎంపిక విధానం :
అభ్యర్థుల ఎంపికలో భాగంగా ముందుగా విద్యార్హతల ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. అవసరాన్ని బట్టి ఇంటర్వ్యూకు ముందు సైకోమెట్రిక్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఇందులో అభ్యర్థుల కమ్యూనికేషన్ నైపుణ్యం, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, ఉద్యోగానికి సరిపోయే లక్షణాలను పరిశీలిస్తారు.
షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ముంబయి, దిల్లీ, చెన్నై, అహ్మదాబాద్ నగరాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను రూపొందిస్తారు. అనంతరం వైద్య పరీక్ష నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.
ఇంటర్వ్యూ ప్రక్రియను ఐసీఏఐ, సిడ్బీ సంయుక్తంగా నిర్వహించనున్నాయి. అభ్యర్థులు తమ దరఖాస్తులను సిడ్బీ వెబ్‌సైట్‌కు కాకుండా ఐసీఏఐ వెబ్‌సైట్ ద్వారా మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది.
అర్హతలు :
- విద్యార్హత: చార్టర్డ్ అకౌంటెంట్ (CA)
- సీఏ తుది పరీక్షలను రెండు ప్రయత్నాల్లోపు పూర్తిచేసి ఉండాలి.
- ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగ అభ్యర్థులకు రెండు ప్రయత్నాల నిబంధనలో సడలింపు అవకాశం ఉంది.
- ఉద్యోగ అనుభవం అవసరం లేదు.
వయోపరిమితి : 2026 జూన్ 30 నాటికి అభ్యర్థుల వయసు 28 సంవత్సరాలకు మించకూడదు.
వేతనం:
ఎంపికైన కన్సల్టెంట్ క్రెడిట్ అనలిస్ట్‌లకు సంవత్సరానికి రూ.12 లక్షల వరకు వేతనం లభిస్తుంది. ఇందులో వర్తించే అలవెన్సులు కూడా ఉంటాయి. పనితీరు, నిబంధనల ప్రకారం వేతనాన్ని ఏటా పెంచే అవకాశం ఉంది.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21 ఆగస్టు 2026
సీఏ అర్హత ఉండి, బ్యాంకింగ్–క్రెడిట్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే అభ్యర్థులకు ఈ నియామకాలు మంచి అవకాశంగా చెప్పొచ్చు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















