కంటిచూపు లేని భార్యకు భర్తే ప్రపంచం అయ్యాడు. వయసు మీద పడినా ప్రతి అడుగులో తోడుగా నిలిచాడు. వయోభారంతో ఆయనకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో కుంగిపోయాడు. తన తర్వాత ఆమె పరిస్థితి ఏమవుతుందనే ఆందోళనతో చరమాంకంలో తప్పటడుగు వేశాడు. ఎంతగానో ప్రేమించిన భార్యను తనే హత్య చేసి.. ఆపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బిహార్‌కు చెందిన నందన్ ప్రసాద్(83), సుమిత్రా దేవి(77) దంపతులకు కుమారుడు కిరణ్‌కుమార్ కశ్యప్ ఉన్నారు. కోడలు, పిల్లలతో కలిసి వీరందరూ బెంగళూరులోని చొక్కనాయనకహళ్లిలోని ఓ అపార్ట్‌మెంట్లో నివసిస్తున్నారు. భారతీయ వాయుసేనలో సేవలందించిన కిరణ్‌కుమార్ పదవీ విరమణ చేసి, ప్రస్తుతం ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. సుమిత్రాదేవికి దృష్టి, వినికిడి లోపాలు ఉండగా, నందన్ ప్రసాద్‌కు హృద్రోగ సమస్యలు ఎదురయ్యాయి. తాను మరణిస్తే భార్యను కుమారుడు, కోడలు చూసుకుంటారో లేదోనన్న అనుమానంతో కొద్దిరోజులుగా నందన్ ప్రసాద్ సతమతమవుతున్నారు. సోమవారం అర్ధరాత్రి భార్యను గొంతు నులిమి హత్య చేసి, అనంతరం ఆయన ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సమయంలో కోడలు, మనవడు బిహార్‌లో ఒక వివాహానికి హాజరయ్యేందుకు వెళ్లగా.. కుమారుడు, మనవరాలు ఇంట్లో మరో గదిలో ఉన్నారు. మంగళవారం ఉదయం గది నుంచి తల్లిదండ్రులు బయటకు రాకపోవడంతో కిరణ్‌కుమార్ లోపలికి వెళ్లి చూడగా వారి మృతదేహాలు కనిపించాయి. బాధితుడి ఫిర్యాదుతో సంపిగెహళ్లి ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















