కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమవుతోందని తెలుస్తోంది. మంగళవారం జరిగిన పరిణామాలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రాష్ట్రపతి కార్యాలయం ఈ సమావేశానికి సంబంధించిన చిత్రాలను ఎక్స్ వేదికగా పంచుకోవడంతో క్యాబినెట్ మార్పులపై ఊహాగానాలు మరింత వేగం పుంజుకున్నాయి.
ఇటీవల కొందరు కేంద్ర మంత్రులకు రాష్ట్రాల్లో పార్టీ బాధ్యతలు అప్పగించడంతో కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలో కేంద్ర మైనారిటీ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్ తన పదవికి రాజీనామా చేయడం కీలక పరిణామంగా భావిస్తున్నారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి వెంటనే ఆమోదించారు.
అదే సమయంలో పార్టీ స్థాయిలోనూ పలు కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. భాజపా ప్రధాన కార్యదర్శి తరుణ్ ఛుగ్, కేంద్ర మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టూతో కలిసి పంజాబ్ పర్యటన ముగించుకుని తిరిగి దిల్లీకి చేరుకున్నారు. ఆప్ నుంచి భాజపాలో చేరిన రాజ్యసభ సభ్యుడు రాఘవ్ ఛడ్డాను కూడా దిల్లీకి రావాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించింది.
నీట్-యూజీ ప్రశ్నపత్రం లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవిపై కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే విధంగా రైల్వే సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టూ, రోడ్డు రవాణా సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా, ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ ఛౌదరి వంటి పలువురు నేతల భవిష్యత్ పదవులపై కూడా అనిశ్చితి నెలకొంది.
మరోవైపు పంజాబ్‌కు ఈసారి కేంద్ర మంత్రివర్గంలో ప్రాధాన్యం లభించే అవకాశముందని తెలుస్తోంది. కమల్జీత్ శెహ్రావత్, సత్నాం సింగ్ సంధూ, సునీల్ ఝాఖడ్ వంటి నేతలకు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















