మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్-గ్రామీణ్ (VB-G RAM G Act) చట్టం నేటి నుంచి అమల్లోకి వచ్చింది. గ్రామీణ ఉపాధి వ్యవస్థలో ఈ చట్టం కీలక మార్పులను తీసుకురానుంది.
ఈ కొత్త చట్టం కింద ఇప్పటివరకు ఉన్న 100 పనిదినాలను 125 రోజులకు పెంచారు. అలాగే కూలీలకు చెల్లించే రోజువారీ వేతనాలను కేంద్ర ప్రభుత్వం తాజాగా నోటిఫై చేసింది. కనిష్ఠంగా రూ.300 నుంచి గరిష్ఠంగా రూ.409 వరకు వేతనం నిర్ణయించగా, సిక్కింలోని కొన్ని పంచాయతీల్లో అత్యధికంగా రూ.450 వరకు చెల్లించనున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది.
పలు రాష్ట్రాల్లో వేతనాలు 15 శాతం కంటే ఎక్కువగా పెరిగాయి. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బిహార్, ఝార్ఖండ్, అస్సాం, త్రిపుర, సిక్కిం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ పెరుగుదల కనిపిస్తోంది. అయితే కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాత్రం పెరుగుదల 3 శాతం లోపే ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
వీబీ జీరామ్‌జీ పథకం కింద 21 రాష్ట్రాల్లో రోజువారీ వేతనం రూ.300గా నిర్ణయించగా, గుజరాత్, రాజస్థాన్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి.
తెలంగాణలో రోజువారీ కూలి రూ.308, ఆంధ్రప్రదేశ్‌లో రూ.312, మహారాష్ట్రలో రూ.317గా నిర్ణయించారు. దాద్రా నగర్ హవేలీ, దమన్-దీవ్‌లో రూ.340, తమిళనాడులో రూ.345, పుదుచ్చేరిలో రూ.347 చెల్లించనున్నారు. కర్ణాటకలో రూ.382, కేరళలో రూ.401, గోవాలో రూ.406గా వేతనాలు నిర్ణయించారు. సిక్కింలోని మూడు పంచాయతీలకు ప్రత్యేకంగా రూ.450 వేతనం చెల్లించనున్నారు.
ఉపాధి హామీ పథకానికి సంబంధించి 2026-27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం వేతన సవరణ చేపట్టలేదు. కొత్త చట్టం అమల్లోకి రావడంతో సవరణను వాయిదా వేసినట్లు సమాచారం. చివరిసారిగా గతేడాది మార్చి 27న వేతనాలను సవరించినట్లు కేంద్రం తెలిపింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















