గ్లోబల్ ఎయిర్‌క్రాఫ్ట్ లీజింగ్ హబ్‌లతో పోటీ పడటానికి కాకుండా వాటికి తోడ్పాటును అందించడమే భారత్ లక్ష్యమని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లోని గిఫ్ట్ సిటీలో శుక్రవారం జరిగిన ఎయిర్‌క్రాఫ్ట్ లీజింగ్ అండ్ ఫైనాన్సింగ్ సమిట్ 2.0 ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు.
భారత విమానయాన రంగం వేగంగా రూపాంతరం చెందుతోందని, దేశం నిర్మిస్తున్న పటిష్ఠమైన ఎకోసిస్టమ్ కేవలం భారత్‌కే కాకుండా పరిసర దేశాలకూ ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన అన్నారు. ప్రపంచ స్థాయిలో కీలక శక్తిగా ఎదగడం భారత్ లక్ష్యమని, అదే సమయంలో గ్లోబల్ మార్కెట్‌కు కూడా సహకారం అందించాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతోందని తెలిపారు.
భారత్‌కు భారీ దేశీయ మార్కెట్ ఉన్నందున భవిష్యత్తులో ప్రపంచం విమానయాన రంగంలో భారత్‌ను ప్రధాన కేంద్రంగా చూస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ దిశగా సరైన ఎకోసిస్టమ్ నిర్మాణం అత్యంత కీలకమని చెప్పారు. గిఫ్ట్ సిటీలోని ని కేవలం రిజిస్ట్రేషన్ కేంద్రంగా కాకుండా పూర్తి స్థాయి సేవా కేంద్రంగా, గ్లోబల్ లీజింగ్ హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యం ఉన్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం గిఫ్ట్ సిటీలో పలు విమాన లీజింగ్ సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించాయని తెలిపారు. 2032 నాటికి దేశంలో విమానాల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని, భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద పౌర విమానయాన మార్కెట్‌గా అవతరించనుందని అంచనా వేశారు. ఈ రంగంలో దేశీయ ఆర్థిక సంస్థల భాగస్వామ్యం పెరగాల్సిన అవసరం ఉందని సూచించారు. విమానయాన రంగ అభివృద్ధికి అవసరమైన చట్టపరమైన, ఆర్థిక సంస్కరణలను కేంద్రం కొనసాగిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
అహ్మదాబాద్‌లో గత ఏడాది జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు తుది దశకు చేరుకుందని, మరో నెలలో నివేదిక వెలువడే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా విచారణను పూర్తిగా పారదర్శకంగా కొనసాగిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















