మహిళల హాకీ ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో భారత్–స్కాట్లాండ్ మధ్య జరిగిన పూల్-బి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగి 2-2తో డ్రాగా ముగిసింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఈ పోరులో ఇరు జట్లు సమానంగా పోరాడాయి. మ్యాచ్ ప్రారంభంలోనే స్కాట్లాండ్‌కు చెందిన హెథర్ మెక్‌ఎవాన్ 6వ నిమిషంలో గోల్ చేసి జట్టుకు ఆధిక్యం అందించింది.
ఆ తర్వాత భారత్ దూకుడు పెంచింది. 18వ నిమిషంలో నవ్‌నీత్ కౌర్ అద్భుత గోల్ చేసి స్కోరును సమం చేసింది. అదే ఊపులో 29వ నిమిషంలో సునెలిటా తొపో మరో గోల్ చేసి భారత్‌ను 2-1 ఆధిక్యంలో నిలిపింది. అయితే రెండోార్థంలో స్కాట్లాండ్ ఆటగాళ్లు కూడా దూకుడుగా ఆడుతూ 33వ నిమిషంలో ఫియోనా బర్నెట్ గోల్ సాధించి స్కోరును 2-2తో సమం చేశారు.ఆ తర్వాత ఇరు జట్లు ఆధిక్యం కోసం గట్టిగా ప్రయత్నించాయి. ముఖ్యంగా చివరి క్వార్టర్‌లో భారత్‌కు అనేక పెనాల్టీ కార్నర్‌లు లభించాయి. కానీ వాటిని గోల్స్‌గా మలచడంలో విఫలమైంది. దీంతో మ్యాచ్ చివరకు 2-2తో డ్రాగా ముగిసింది.
ఈ ఫలితంతో భారత్ నాలుగు పాయింట్లతో పూల్-బిలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. తొలి మ్యాచ్‌లో ఉరుగ్వేను 4-0తో చిత్తు చేసిన భారత్.. తన తదుపరి మ్యాచ్‌లో బుధవారం వేల్స్‌ను ఎదుర్కొననుంది. ఇదిలా ఉండగా సోమవారం జరిగిన మరో పూల్-బి మ్యాచ్‌లో ఉరుగ్వే 3-2తో వేల్స్‌ను ఓడించింది. పూల్-ఎలో ఇంగ్లాండ్ 3-0తో కొరియాపై, ఇటలీ 3-0తో ఆస్ట్రియాపై విజయం సాధించాయి.ఇదిలా ఉండగా భారత్–స్కాట్లాండ్ మ్యాచ్‌కు భారత స్టార్ షట్లర్ పి.వి. సింధు ప్రత్యేక అతిథిగా హాజరై ఆటగాళ్లను ఉత్సాహపరిచింది. ఆమె హాజరు ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















