విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన అనస్తీషియా పీజీ విద్యార్థిని బత్తుల దీపిక కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆమె సీనియర్ డాక్టర్ అమర్ సహస్‌రెడ్డిను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం అతడిని విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్కు పిలిపించి గంటలపాటు విచారించిన అనంతరం అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం… అనంతపురం జిల్లాకు చెందిన కోదండరామిరెడ్డి, భారతి దంపతుల కుమార్తె దీపిక తిరుపతి వెంకటేశ్వర మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి, ప్రస్తుతం విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో అనస్తీషియా విభాగంలో పీజీ చివరి సంవత్సరం చదువుతోంది. గత నెల 5వ తేదీ అర్ధరాత్రి సమయంలో విధుల్లో ఉన్న ఆమె ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌లోని ఆపరేషన్ థియేటర్‌లో విగతజీవిగా కనిపించింది. మొదట ఈ ఘటనను పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశారు.
విచారణలో దీపికకు హైదరాబాద్ బాచుపల్లికి చెందిన సీనియర్ డాక్టర్ అమర్ సహస్‌రెడ్డితో గత ఏడాది నుంచి పరిచయం ఉన్నట్లు తెలిసింది. ఆ పరిచయం తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ సంబంధం ఏర్పడింది. అయితే ఇదే సమయంలో అమర్ విశాఖపట్నంలో ఎంబీబీఎస్ చదివిన సమయంలో పరిచయమైన తన బ్యాచ్‌మేట్‌తో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ కారణంగా దీపికను దూరం పెట్టడంతో వారిద్దరి మధ్య తరచూ వాగ్వాదాలు జరిగేవని పోలీసులు తెలిపారు.
దీపిక మరణించిన రోజు రాత్రి 10.40 నుంచి 12.30 గంటల వరకు ఇద్దరి మధ్య ఫోన్‌లో మాట్లాడినట్లు కాల్ రికార్డులు వెల్లడించాయి. ఆ సమయంలో తనకు పెళ్లి ఖరారైందని, ఆమెను వివాహం చేసుకోలేనని అమర్ స్పష్టంగా చెప్పినట్లు విచారణలో బయటపడింది. ఒకసారి విజయవాడకు రావాలని దీపిక కోరినా అతను తిరస్కరించాడని పోలీసులు తెలిపారు.
ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం… రోగులకు మత్తు ఇవ్వడానికి ముందు కండరాలను సడలించేందుకు ఉపయోగించే ప్రత్యేక ఇంజక్షన్‌ను దీపిక తీసుకోవడంతో ఆమె మృతి చెందినట్లు తేలింది. అమర్ వివాహానికి నిరాకరించడం వల్ల తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు కేసును అనుమానాస్పద మృతి నుంచి మార్చి, ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసుగా నమోదు చేశారు. నిందితుడు అమర్ సహస్‌రెడ్డిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కేసుపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















