నేపాల్‌లో సంభవించిన భారీ వరదలు, జలప్రళయం తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. వరదల కారణంగా గల్లంతైన వారి సంఖ్య భారీగా పెరుగుతుండగా.. తాజాగా ఇన్ఫోసిస్ అనుబంధ సంస్థ పబ్లిక్ సర్వీసెస్ సీఈఓ లక్ష్మీనాథ్ గోపిశెట్టి ఆచూకీ కూడా లభించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
వ్యక్తిగత పనిమీద నేపాల్ వెళ్లిన గోపిశెట్టిని సంప్రదించలేకపోతున్నామని ఇన్ఫోసిస్ వెల్లడించింది. ఆయన ఆచూకీ కోసం సంబంధిత ప్రభుత్వ సంస్థలు, ఏజెన్సీలతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపింది.
‘‘ఈ క్లిష్ట సమయంలో గోపిశెట్టి కుటుంబానికి అవసరమైన సహకారం అందిస్తాం. ఆయన సురక్షితంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాం’’ అని ఇన్ఫోసిస్ పేర్కొంది.
లక్ష్మీనాథ్ గోపిశెట్టి బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్‌కు సీఈఓగా ఉన్నారు. అమెరికా, కెనడాలోని ప్రభుత్వ రంగ సంస్థలకు సాంకేతికత, వ్యూహాలు, కార్యకలాపాల నిర్వహణలో సంస్థ సేవలు అందిస్తోంది.
ఇన్ఫోసిస్‌లో చేరకముందు గోపిశెట్టి గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. బిజినెస్ అప్లికేషన్స్, డిజిటల్ వర్క్‌స్పేస్ సర్వీసెస్ విభాగాలకు నాయకత్వం వహించారు. అంతకుముందు ప్రముఖ ఐటీ సంస్థ యాక్సెంచర్‌లో మేనేజింగ్ డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు.
నేపాల్ వరదల్లో చిక్కుకున్న వారిలో పలువురు విదేశీయులు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సహాయక చర్యలను మరింత వేగవంతం చేస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















