చక్కెర సరఫరా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం.. మిల్లుల విక్రయాలపై కఠిన నిఘా పెట్టింది. కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచే ప్రయత్నాలను అడ్డుకునేందుకు సెప్టెంబరు నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి చక్కెర విక్రయ కోటాను కేటాయించనుంది.
ప్రస్తుతం నెలవారీగా ఇస్తున్న కోటా విధానంలో కొన్ని మిల్లులు నిల్వల వివరాల్లో తేడాలు చూపించడం, కేటాయించిన పరిమాణం కంటే తక్కువ విక్రయించడం వంటి అంశాలు బయటపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది.
కొత్త విధానం ప్రకారం మిల్లులు తమకు కేటాయించిన చక్కెరలో 40 శాతాన్ని మొదటి వారంలోనే మార్కెట్‌కు విడుదల చేయాలి. మిగిలిన పరిమాణాన్ని రెండో వారంలో విక్రయించాల్సి ఉంటుంది. దీంతో మార్కెట్‌లో సరఫరా పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.
ఇప్పటికే విదేశాల నుంచి 10 లక్షల టన్నుల ముడి చక్కెర దిగుమతికి అనుమతులు ఇవ్వడంతో పాటు నిల్వలపై పరిమితులు విధించినట్లు కేంద్రం తెలిపింది. ఈ చర్యల ఫలితంగా మిల్లుల వద్ద చక్కెర విక్రయ ధరలు తగ్గుముఖం పట్టాయని పేర్కొంది.
పండగల సమయంలో చక్కెర కొరత వస్తుందనే ఆందోళనతో ప్రజలు అధికంగా కొనుగోలు చేసి నిల్వ చేసుకోవద్దని కేంద్రం సూచించింది. దేశంలో అవసరానికి సరిపడా చక్కెర నిల్వలు ఉన్నాయని స్పష్టం చేసింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















