సోషల్ మీడియా ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి.. ఆపై రహస్య వివాహానికి దారితీసింది. చివరకు అదే సంబంధం తల్లీకూతుళ్ల హత్యకు కారణమైంది. తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లా పల్లడం సమీపంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
పచ్చాపాళైయం ప్రాంతానికి చెందిన పళనిసామి, ధనలక్ష్మి(42) దంపతులు స్థానిక వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్నారు. వారి కుమార్తె పూవరసి(22) ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తోంది. మంగళవారం ఉదయం పళనిసామి విధులకు వెళ్లిన సమయంలో ఇంట్లో ధనలక్ష్మి, పూవరసి మాత్రమే ఉన్నారు. అదే సమయంలో ఓ యువకుడు ఇంట్లోకి చొరబడి ఇద్దరిపై కత్తితో దాడి చేశాడు.
తల్లీకూతుళ్ల కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకునేలోపే ఇద్దరూ తీవ్ర రక్తస్రావంతో మృతిచెందారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
దర్యాప్తులో పోలీసులకు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దిండుక్కల్‌కు చెందిన 27 ఏళ్ల అక్షయ్‌కు ఐదేళ్ల క్రితం పూవరసి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైనట్లు గుర్తించారు. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారగా.. కొన్ని నెలల క్రితం ఇద్దరూ రహస్యంగా వివాహం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే పూవరసి తన తల్లిదండ్రుల ఇంట్లోనే ఉంటూ ఉద్యోగం కొనసాగించింది.
వారి ప్రేమ, వివాహం విషయం ధనలక్ష్మికి తెలియడంతో కుమార్తెను అక్షయ్‌తో మాట్లాడవద్దని మందలించినట్లు సమాచారం. దీంతో పూవరసి అతడితో మాట్లాడటం మానేసింది. ఈ పరిణామంతో ఆగ్రహానికి గురైన అక్షయ్.. పూవరసి, ఆమె తల్లి ధనలక్ష్మిపై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















