పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్‌కు అక్రమంగా యుద్ధ సామగ్రి సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలతో అమెరికాలో ఒక మహిళా వ్యాపారవేత్త అరెస్టు అయ్యింది. ఇరాన్ మూలాలున్న 44 ఏళ్ల షమీమ్ మాఫి అనే వ్యక్తి, బాంబులు, డ్రోన్లు, మందుగుండు సామగ్రి సరఫరా నెట్‌వర్క్‌లో కీలక పాత్ర పోషించినట్లు అమెరికా అధికారులు గుర్తించారు.లాస్ ఏంజిలెస్ విమానాశ్రయంలో శనివారం రాత్రి ఆమెను అరెస్టు చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. షమీమ్ మాఫి అమెరికాలో స్థిరపడినప్పటికీ, ఇరాన్ ప్రభుత్వంతో కలిసి అక్రమ రక్షణ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఆమె సాయుధ డ్రోన్లు, ముఖ్యంగా మొహాజెర్-6 డ్రోన్లను సరఫరా చేయడానికి ఇరాన్ రక్షణ మంత్రిత్వశాఖతో సుమారు 70 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు అధికారులు ఆరోపిస్తున్నారు. అలాగే సూడాన్ రక్షణ మంత్రిత్వశాఖకు వేల సంఖ్యలో బాంబు ఫ్యూజ్‌లు పంపిన నెట్‌వర్క్‌లో కూడా ఆమె పాత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి.
2022 డిసెంబర్, 2025 జూన్ నెలల్లో ఇరాన్ అధికారులతో నేరుగా సంప్రదింపులు జరిపినట్లు ఫోన్ రికార్డులు కోర్టులో సమర్పించబడినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆరోపణలను షమీమ్ మాఫి ఖండిస్తూ, తాను ఎలాంటి అధికారిక మధ్యవర్తిత్వం చేయలేదని పేర్కొంది.2013లో ఇరాన్ నుంచి అమెరికాకు వలస వచ్చిన ఆమెకు 2016లో శాశ్వత నివాస హోదా లభించింది. ఈ అరెస్టు, పాకిస్థాన్ వేదికగా అమెరికా–ఇరాన్ శాంతి చర్చలు కొనసాగుతున్న సమయంలో జరగడం గమనార్హమని విశ్లేషకులు చెబుతున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















