అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం పొడిగించిన కొన్ని గంటల్లోనే హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (IRGC) రెండు నౌకలపై కాల్పులకు దిగింది.
యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ సమాచారం ప్రకారం, ముందస్తు హెచ్చరికలు ఇవ్వకుండా కంటైనర్ నౌకపై కాల్పులు జరపడంతో నౌకకు నష్టం వాటిల్లింది. అయితే సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. మరో రవాణా నౌకపై కూడా కాల్పులు జరిగినప్పటికీ పెద్దగా నష్టం జరగలేదు. ఇటీవల టెహ్రాన్‌కు చెందిన వాణిజ్య నౌకను అమెరికా దళాలు స్వాధీనం చేసుకోవడం నేపథ్యంలో ఈ దాడులు చోటుచేసుకోవడం పరిస్థితులను మరింత ఉద్రిక్తం చేసింది.
ఇక చర్చల విషయంలో ఇరాన్ కఠిన వైఖరిని కొనసాగిస్తోంది. హర్మూజ్ జలసంధిలో తమ నౌకలపై అమెరికా విధించిన దిగ్బంధనాన్ని ఎత్తివేస్తేనే తదుపరి చర్చలకు సిద్ధమని స్పష్టం చేసింది. ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరావానీ మాట్లాడుతూ, చర్చలకు తాము సిద్ధమేనని, అయితే తమ షరతులు నెరవేర్చాల్సిందేనని పేర్కొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















