జేఈఈ మెయిన్ సెషన్–1 పరీక్షలను ఈసారి సుమారు 12.58 లక్షల మంది విద్యార్థులు రాశారు. అయితే వీరిలో సీరియస్‌గా సిద్ధమైన వారు మూడు లక్షల మంది వరకు మాత్రమే ఉంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాబట్టి పెద్ద సంఖ్య చూసి భయపడకుండా, మీకు మీరే పోటీగా భావిస్తూ సెషన్–2 కోసం పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలి. సరైన వ్యూహంతో సిద్ధమైతే రెండో సెషన్‌లో మంచి స్కోరు సాధించడం సాధ్యమే.
సెషన్–1 పరీక్షల స్థాయి ఇలా
సెషన్–1లో మొత్తం పది పేపర్లు మధ్యస్థం నుంచి కాస్త కఠిన స్థాయిలో ఉన్నాయని విశ్లేషణలు చెబుతున్నాయి. ముఖ్యంగా మ్యాథ్స్ ప్రశ్నలు ఎక్కువ సమయం తీసుకునేలా అడిగారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రశ్నలు తేలిక నుంచి మధ్యస్థ స్థాయిలో ఉన్నప్పటికీ కొన్ని కాన్సెప్ట్ ఆధారిత ప్రశ్నలు విద్యార్థులను కాస్త ఇబ్బంది పెట్టాయి.
మ్యాథ్స్:
సిలబస్ పరిధిలోనే ప్రశ్నలు వచ్చినప్పటికీ కాలిక్యులస్, ఆల్జీబ్రాలో బహుళ కాన్సెప్ట్‌లను కలిపి అడిగారు. వీటిని పరిష్కరించడానికి ఎక్కువ సమయం పట్టింది.
ఫిజిక్స్:
ఫిజిక్స్‌లో ఎక్కువ ప్రశ్నలు సూత్రాలపై ఆధారపడి వచ్చాయి. కొన్ని అడ్వాన్స్‌డ్ న్యూమరికల్ ప్రశ్నలు ఉండటం వల్ల కొంత తడబాటు కనిపించింది.
కెమిస్ట్రీ:
ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను బాగా చదివిన వారికి కెమిస్ట్రీ ప్రశ్నలు సులభంగానే ఉన్నాయి. అయితే స్టేట్‌మెంట్ ఆధారిత ప్రశ్నలు కొంత సమయం తీసుకున్నాయి.
సెషన్–2లో అధిక స్కోరు కోసం ఇలా సిద్ధం కావాలి
సెషన్–1లో వచ్చిన మొత్తం 750 ప్రశ్నలను విశ్లేషిస్తే కొన్ని ముఖ్యమైన టాపిక్స్‌పై ఎక్కువ దృష్టి పెట్టడం అవసరం.
మ్యాథ్స్‌లో:
- ఇంటిగ్రల్, డిఫరెన్షియల్ కాలిక్యులస్
- డిఫరెన్షియల్ ఈక్వేషన్స్
- వెక్టార్స్, త్రీడీ జ్యామెట్రీ
- కోఆర్డినేట్ జ్యామెట్రీ
- పర్మిటేషన్స్ & కాంబినేషన్స్, ప్రాబబిలిటీ
ఈ టాపిక్స్‌లో ప్రశ్నలు బహుళ కాన్సెప్ట్‌లతో వస్తాయి కాబట్టి ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి.
కెమిస్ట్రీలో:
- కోఆర్డినేషన్ కాంపౌండ్స్
- జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ
- కెమికల్ బాండింగ్
- డీ, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్
ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఎన్‌సీఈఆర్‌టీపై పట్టు ఉండటం చాలా ముఖ్యం. ఫిజికల్ కెమిస్ట్రీలో న్యూమరికల్ సమస్యలను ఎక్కువగా సాధన చేయాలి.
ఫిజిక్స్‌లో:
- మోడరన్ ఫిజిక్స్
- కరెంట్ ఎలక్ట్రిసిటీ
- రే ఆప్టిక్స్
- గ్రావిటేషన్
మెకానిక్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, రొటేషనల్ డైనమిక్స్‌లలో బహుళ కాన్సెప్ట్‌లతో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
ప్రిపరేషన్‌లో పాటించాల్సిన చిట్కాలు
- ప్రతి సబ్జెక్టులో ఫార్ములా షీట్ తయారు చేసుకుని తరచూ రివిజన్ చేయాలి.
- రోజు విడిచి రోజు మాక్ టెస్టులు రాసి విశ్లేషించాలి.
- రోజూ ప్రతి సబ్జెక్టు నుంచి కనీసం 20 ప్రశ్నలు సాధన చేయాలి.
- 2024, 2025 జేఈఈ ప్రశ్నాపత్రాలను పూర్తిగా ప్రాక్టీస్ చేయాలి.
- ఎక్కువ ప్రశ్నలు attempt చేయడం కన్నా కచ్చితంగా attempt చేయడంపై దృష్టి పెట్టాలి.
కచ్చితత్వమే విజయం
సెషన్–1లో వచ్చిన 750 ప్రశ్నల్లో 500కు పైగా ప్రశ్నలు సాధారణ స్థాయి విద్యార్థులకూ సాధ్యమైనవే. కాబట్టి ముందుగా సులభమైన ప్రశ్నలను గుర్తించి వాటిని ఖచ్చితంగా attempt చేయడం ద్వారా మంచి స్కోరు సాధించవచ్చు.
సరైన ప్రణాళిక, క్రమశిక్షణతో చదివితే రెండో సెషన్‌లో మంచి ర్యాంక్ సాధించే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder Movies News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews



















