కరూర్ తొక్కిసలాట ఘటన బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన వ్యవహారంలో తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ నియామకాలు చెల్లవంటూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఈ వ్యవహారంపై తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు పిటిషన్‌దారులకు నోటీసులు జారీ చేసింది.
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కుటుంబానికి జీవనాధారంగా ఉన్న వ్యక్తి ప్రమాదవశాత్తూ మరణిస్తే, ఆ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలవకూడదా? అని పిటిషన్‌దారులను ప్రశ్నించింది.
కరూర్ తొక్కిసలాటలో పలువురు ప్రాణాలు కోల్పోయారని, బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం పరిహారం అందించాలని నిర్ణయించిందని ధర్మాసనం పేర్కొంది. అలాంటి పరిస్థితుల్లో బాధిత కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించడాన్ని ప్రశ్నించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది. కుటుంబాన్ని పోషించే వ్యక్తిని కోల్పోయినప్పుడు ఆయన కుమారుడు లేదా కుమార్తెకు ప్రభుత్వం ఉపాధి కల్పించకూడదా? అని వ్యాఖ్యానించింది.
కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలకు విజయ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడాన్ని సవాల్ చేస్తూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. జులైలో దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఆ నియామకాలు చెల్లవని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగాలు ఉచితంగా పంచిపెట్టేవి కావని, వాటి కోసం ఎంతోమంది అభ్యర్థులు పోటీ పడుతున్నారని అప్పట్లో వ్యాఖ్యానించింది. రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే ప్రభుత్వం నియామకాలు చేపట్టాలని సూచించింది.
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాజాగా సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించడంతో ప్రభుత్వానికి తాత్కాలికంగా ఊరట లభించింది.
కరూర్ తొక్కిసలాట నేపథ్యం :
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో గతేడాది సెప్టెంబరులో కరూర్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరగడంతో 41 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన విజయ్.. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు జులై 10న కరూర్‌లో పర్యటించి అర్హులకు నియామక పత్రాలను అందజేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















