తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు భారాస (బీఆర్‌ఎస్) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాధన ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలను ఆయన స్మరించుకున్నారు.
కేసీఆర్ తన ప్రకటనలో తెలంగాణ ప్రజలపై దశాబ్దాలపాటు సాగిన అణచివేతకు వ్యతిరేకంగా పోరాడి, అనేక అవాంతరాలను అధిగమించి ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేసి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తుచేశారు. ఉద్యమ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించుకున్నామని పేర్కొన్నారు.
గత పదేళ్ల పాలనలో వచ్చిన విమర్శలను తట్టుకుని ప్రగతి పాలనను అందించామని కేసీఆర్ అన్నారు. తెలంగాణను దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుకున్నామని ఆయన పేర్కొన్నారు.
ప్రగతికి చిరునామాగా మారిన తెలంగాణ అస్తిత్వం మరోసారి ప్రమాదంలో పడకుండా అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర రక్షణలో భారాస ఎల్లప్పుడూ రక్షణ కవచంగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















