తెలంగాణ రాజకీయాలపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాతో తమ పార్టీ పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. అదే సమయంలో దేశంలో ప్రతిపాదిత డీలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
హరియాణాలోని సోనిపట్‌లో ఉన్న ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో ‘ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్: ది స్టోరీ ఆఫ్ ఎ స్టార్టప్ స్టేట్’ అంశంపై కేటీఆర్ ప్రత్యేక ప్రసంగం చేశారు. అనంతరం విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో రాజకీయాలు, పాలన, సాంకేతిక పరిజ్ఞానం, తెలంగాణ అభివృద్ధి తదితర అంశాలపై మాట్లాడారు.
లోక్‌సభ స్థానాల పునర్విభజనపై మాట్లాడుతూ.. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలకు లోక్‌సభలో ఉన్న ప్రాతినిధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, దేశవ్యాప్తంగా మొత్తం స్థానాలను దామాషా ప్రకారం పెంచాలని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ విధంగా చేస్తే డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వడంలో తమ పార్టీకి అభ్యంతరం ఉండదని తెలిపారు.
కృత్రిమ మేధస్సు (ఏఐ)పై కూడా కేటీఆర్ స్పందించారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం వచ్చిన ప్రతిసారీ ఉద్యోగాలు, భవిష్యత్తుపై ఆందోళనలు వ్యక్తమవుతాయని, ఏఐ విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోందన్నారు. సాంకేతిక మార్పులను అర్థం చేసుకుని, వాటిని స్వీకరిస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
తన ప్రసంగంలో తెలంగాణ అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రస్తావించిన కేటీఆర్.. సాగునీరు, తాగునీరు, వ్యవసాయం, విద్యుత్, పారిశ్రామిక రంగాల్లో చేపట్టిన వివిధ కార్యక్రమాలను వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రస్తావిస్తూ.. కరవు ప్రభావిత ప్రాంతాలకు గోదావరి జలాలను తరలించడం ఒక చారిత్రక సవాలని, దానికి ఇంజినీరింగ్ పరిష్కారంగా ఈ ప్రాజెక్టును అభివర్ణించారు.
తెలంగాణలో స్టార్టప్‌లు, ఆవిష్కరణలకు అనుకూల వాతావరణం కల్పించడంలో టీ-హబ్, వీ-హబ్, టీ-వర్క్స్, టాస్క్ వంటి సంస్థల పాత్రను కూడా వివరించారు. యువతలో నైపుణ్యాలను పెంచడంతో పాటు ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించడం ద్వారా రాష్ట్రంలో కొత్త అవకాశాలను సృష్టించవచ్చని ఆయన పేర్కొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















