నిర్ణీత వయసుకు లోబడిన మైనర్లను సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంచే దిశగా స్పష్టమైన విధివిధానాలను రూపొందించాలని మంత్రి నారా లోకేశ్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. సామాజిక మాధ్యమాల జవాబుదారీతనాన్ని బలోపేతం చేసే అంశంపై ఆయన అధ్యక్షతన బుధవారం సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈ సమావేశంలో సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, హోం మంత్రి అనిత, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సమావేశంలో మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. చిన్నారులపై సోషల్ మీడియా ప్రతికూల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో, సింగపూర్, ఆస్ట్రేలియా, మలేసియా, ఫ్రాన్స్ వంటి దేశాల్లో అమలవుతున్న చట్టాలు, విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కూడా పరిగణనలోకి తీసుకొని రాష్ట్రానికి అనువైన నియమాలను రూపొందించాలని తెలిపారు. మలేసియాలో మై డిజిటల్ ఐడీ, పాస్‌పోర్ట్ వివరాలతో ఈ-కేవైసీ అనుసంధానం చేసి 16 ఏళ్లు పైబడినవారికే సోషల్ మీడియా యాక్సెస్ ఇస్తున్న విధానాన్ని మంత్రి మనోహర్ సమావేశంలో వివరించారు.
చిన్నారులను సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంచాలన్న అంశంపై మంత్రుల బృందం ఏకాభిప్రాయానికి వచ్చింది. అయితే ఎంత వయోపరిమితి విధించాలన్న విషయంపై వివిధ దేశాల్లో అమలవుతున్న చట్టాలను సమగ్రంగా పరిశీలించాలని అధికారులకు సూచించారు.
ఇక సామాజిక మాధ్యమాల్లో ఫేక్ వార్తలు ప్రచారం చేయడం, కులం–మతం–ప్రాంతం పేరుతో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. ఇటువంటి హ్యాబిచ్యువల్ అఫెండర్స్‌ను కట్టడి చేసేందుకు గూగుల్, మెటా, ఎక్స్ వంటి సోషల్ మీడియా సంస్థల కంప్లయన్స్ ఆఫీసర్లను తదుపరి సమావేశానికి పిలవాలని అధికారులను ఆదేశించారు.
విద్వేష వ్యాఖ్యలపై చర్యలకు వీలుగా ఐటీ యాక్ట్ సెక్షన్–46 ప్రకారం రాష్ట్రస్థాయి అడ్జుడికేటింగ్ ఆఫీసర్ నియామకానికి నోటిఫికేషన్ జారీ చేయాలని సమావేశంలో నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ సహయోగ్ పోర్టల్ ద్వారా ఇప్పటికే కొన్ని కేసులపై చర్యలు చేపడుతున్నట్లు అధికారులు మంత్రులకు వివరించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















