తమిళ నటుడు జయం రవి (రవి మోహన్)తో తన రిలేషన్‌షిప్‌పై వస్తోన్న రూమర్స్‌కు గాయని కెనీషా స్పందించారు. ఈ విషయంపై ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సుదీర్ఘ భావోద్వేగ పోస్ట్‌ను షేర్ చేశారు. రవితో తన సంబంధం ముగిసినట్లుగా పరోక్షంగా సూచిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ వార్తలతో తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానని కెనీషా తెలిపారు. చెన్నైను వదిలి వెళ్లిపోతున్నట్లు వెల్లడించిన ఆమె, తనకు ఎంతో ఇష్టమైన సంగీతానికి కూడా దూరమవుతున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను డిలీట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం తన జీవితంలో తీసుకోవాల్సి వచ్చిన బాధాకరమైన అడుగులలో ఒకటని ఆమె చెప్పారు.
తన పోస్ట్‌లో కెనీషా భావోద్వేగంగా స్పందిస్తూ, “ఈ కథలోకి నేను ఎంతో ప్రేమతో అడుగుపెట్టాను. కానీ ఇప్పుడు నిశ్శబ్దంగా వెనుదిరుగుతున్నాను. ప్రపంచం అహంకారాలు, అవాస్తవ కథనాలతో నిండిపోయింది. అలాంటి చోట మంచితనానికి చోటు ఉండదు. ప్రేమ కూడా భారంగా మారుతుంది” అని పేర్కొన్నారు. ఒక వ్యక్తిని రక్షించే ప్రయత్నంలో తాను చాలా కోల్పోయానని, కానీ చివరికి నిజం ఏమిటో అర్థమైందని ఆమె అన్నారు.
అలాగే ట్రోలింగ్‌పై స్పందిస్తూ, “అతడిని ప్రేమించే వారికి అతడి జీవితంపై హక్కులు ఉన్నాయనుకునే వారికి చెప్పేది ఒక్కటే… అతడు ఇక పూర్తిగా మీవాడే” అని కెనీషా పేర్కొన్నారు. ఇకపై ఎలాంటి వివరణలు ఇవ్వనని, యుద్ధాలు చేయలేనని కూడా ఆమె స్పష్టం చేశారు. మంచి కోసం నిలబడాలని అనుకోవడం తన అమాయకత్వమని, ఈ ప్రపంచం ఎక్కువగా తప్పు కథనాలను నమ్ముతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
“నేను ఓడిపోయాను. చెన్నై వదిలి వెళ్లిపోతున్నాను. నా సంగీతాన్ని, నా థెరపీని, నా జీవితాన్ని వదులుకుంటున్నాను. దేవుడు సృష్టించిన దాన్ని మనుషులు ముక్కలు చేయగలరని అర్థమైంది. ఈ ఆన్‌లైన్ వేధింపుల వల్లనే నేను ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాను” అని ఆమె పేర్కొన్నారు. చివరగా “ఫెమినిజం గెలిచింది, కానీ సంతోషం ఓడిపోయింది” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారి తీశాయి.
ఇక రవిమోహన్ తన భార్య ఆర్తి నుంచి విడిపోతున్నట్లు 2024లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే ఆయన గాయని కెనీషాతో రిలేషన్‌లో ఉన్నారనే రూమర్స్ సోషల్ మీడియాలో చర్చకు వచ్చాయి.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















