భారత్–అమెరికా మధ్య మరోసారి వాణిజ్య చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్‌తో భారత్ రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా భేటీ అయ్యారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (India–US Trade Deal)పై వీరిద్దరూ కీలక చర్చలు జరిపారు.ద్వైపాక్షిక సహకారం పెంపు, అలాగే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న తాజా పరిణామాలపై కూడా చర్చించినట్లు క్వాత్రా ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. ఈ భేటీలో అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రెయిన్ కూడా పాల్గొన్నారు.
వచ్చే వారం భారత్ వాణిజ్య బృందం వాషింగ్టన్‌కు వెళ్లనున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏప్రిల్ 20 నుంచి మూడు రోజుల పాటు వాషింగ్టన్‌లో ఇరు దేశాల మధ్య కీలక వాణిజ్య చర్చలు జరగనున్నాయి.
భారత్‌పై అమెరికా ప్రారంభించిన సెక్షన్ 301 దర్యాప్తును ఉపసంహరించుకోవాలన్న అంశంపైనా ఈ చర్చల్లో ప్రస్తావన వచ్చినట్లు సమాచారం. ఈ దర్యాప్తు ప్రకారం కొన్ని దేశాలు అన్యాయ వాణిజ్య విధానాలు అనుసరిస్తున్నాయా అనే కోణంలో అమెరికా పరిశీలన జరుపుతోంది.భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై జరుగుతున్న ఈ పరిణామాలు ద్వైపాక్షిక సంబంధాల్లో మరింత కీలక దశకు దారి తీస్తున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















