భారతీయ చిత్రసీమలో గొప్ప ప్రేమకథలలో ఒకటిగా నిలవనుంది ‘చెన్నై లవ్‌స్టోరీ’ అని కథానాయకుడు కిరణ్ అబ్బవరం తెలిపారు. శ్రీ గౌరి ప్రియతో జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత ఎస్‌కేఎన్‌తో కలిసి సాయి రాజేశ్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
సోమవారం హైదరాబాద్‌లో విడుదలైన చిత్ర గీత ‘గుర్తుందా.. గుర్తుందా’కి మణిశర్మ స్వరాలు సమకూర్చగా, అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. హరిచరణ్, శ్రుతిక సముద్రాల ఆలపించారు. కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, ‘‘పాటలాగే ఈ సినిమా కూడా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నా పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుంది. రవి రాసిన డైలాగ్స్ నటుడిగా నన్ను మరింత ఉత్సాహపరిచాయి. ఈ చిత్రంలో మొత్తం ఏడు పాటలున్నాయి. విడుదలైన రోజు థియేటర్లలో మణిశర్మ కాన్సర్ట్ కూడా జరుగుతుంది’’ అని పేర్కొన్నారు.
నిర్మాత ఎస్‌కేఎన్ తెలిపారు, ‘‘ప్రేక్షకుల పెట్టే డబ్బుకు రెట్టింపు అనుభూతిని ఇచ్చే చిత్రమవుతుంది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం.’’ దర్శక నిర్మాత సాయి రాజేశ్ పేర్కొన్నారు, ‘‘సినిమా కొంత భాగాన్ని చూసి కన్నీళ్లు ఆపలేకపోయా. ఇది కిరణ్‌కు జ్ఞాపకంగా నిలిచే చిత్రమవుతుంది’’ అని తెలిపారు.ఈ కార్యక్రమంలో రవి నంబూరి, మణిశర్మ, అనంత శ్రీరామ్, గౌరి ప్రియా, ధీరజ్ మొగిలినేని, విప్లవ్, విశ్వాస్ తదితరులు పాల్గొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















