సంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రైవేట్ డిప్లొమా కళాశాలలో జరిగిన ఘటన కలకలం రేపుతోంది. హోంవర్క్ చేయలేదనే కారణంతో అధ్యాపకుడు విద్యార్థులపై దాడి చేయడంతో 15 మంది డిప్లొమా విద్యార్థులు గాయపడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన హత్నూర మండల పరిధిలోని తుర్కలఖానాపూర్ శివారులో ఉన్న రత్నపురి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో చోటుచేసుకుంది.
మంగళవారం జరిగిన ఈ ఘటనలో సీఎస్‌సీ విభాగానికి చెందిన విద్యార్థులు తరగతి గదిలో ఉన్న సమయంలో అధ్యాపకుడు శోరెడ్డి అక్కడికి వచ్చి హోంవర్క్ గురించి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. విద్యార్థులు హోంవర్క్ చేయలేదని చెప్పడంతో ఆయన తీవ్ర ఆగ్రహానికి గురయ్యారని సమాచారం. అనంతరం తరగతి గది తలుపు మూసి కేబుల్ తీగతో విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టినట్లు బాధితులు తెలిపారు.
ఈ దాడిలో విద్యార్థుల కాళ్లు, చేతులు, తొడలపై గాయాలు కాగా కొందరికి రక్త గాయాలు కూడా అయ్యాయి. గాయపడిన విద్యార్థుల్లో తుర్కలఖానాపూర్, రొయ్యపల్లి, ఇంద్రేశం, జహీరాబాద్ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. కొంతమంది విద్యార్థులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఈ ఘటన విద్యా వాతావరణంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. విద్యార్థులపై ఈ విధంగా దాడి చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయం అని స్థానికులు పేర్కొంటున్నారు. కాగా ఈ ఘటనపై కళాశాల యాజమాన్యం నుంచి ఇప్పటివరకు స్పష్టమైన స్పందన రాలేదు. అధ్యాపకుడిని సంప్రదించేందుకు ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదని తెలిసింది.
ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టే అవకాశముందని, విద్యార్థుల ఫిర్యాదు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APDevelopment APNews APPolitics Breaking news BreakingNews Business BusinessNews ChandrababuNaidu Chandrababu naidu CricketNews CrimeNews Entertainment Geopolitics Government HealthyLifestyle India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate NewsUpdates PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews SportsNews Tdp Telangana TelanganaNews TeluguCinema TeluguNews WorldNews



















