Telangana లోని Nizamabad జిల్లాలో జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం భయానక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇందల్‌వాయి మండలం చంద్రాయన్‌పల్లి పరిధిలోని 44వ నంబరు జాతీయ రహదారిపై వరుస ప్రమాదాలతో భారీ కలకలం రేగింది.
హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న ఓ లారీకి టైరు పంక్చర్ కావడంతో రహదారిపై నిలిపివేశారు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన డీసీఎం వాహనం దానిని ఢీకొట్టింది. ప్రమాదాన్ని తప్పించే క్రమంలో కొబ్బరి బొండాలతో వెళ్తున్న మరో లారీ అదుపుతప్పి రహదారి పక్కన బోల్తాపడింది.
ఈ ఘటనలను గమనించిన వాహనదారులు ఏడు కార్లను రోడ్డుపై నిలిపివేశారు. అయితే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఎరువుల లారీ బ్రేకులు అదుపులోకి రాక ఆగి ఉన్న కార్లను వరుసగా ఢీకొట్టుకుంటూ వెళ్లింది. దీంతో కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, పలువురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని ఐదు అంబులెన్సుల ద్వారా జిల్లా కేంద్ర ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదంతో కొంతసేపు జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















