కథేంటంటే.. మధ్యతరగతి కుటుంబానికి చెందిన రఘు ఓ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేస్తుంటాడు. తల్లిదండ్రులు, చెల్లితో కలిసి ప్రశాంతంగా జీవించే అతడు.. తండ్రి చెప్పిన మాటలను పాటిస్తూ ఎలాంటి అనవసర ఖర్చులకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉంటాడు. అయితే ఓ కార్యక్రమంలో అవంతికను చూసిన రఘు.. ఆమెపై మనసు పారేసుకుంటాడు. రఘు ప్రేమను అవంతిక కూడా అంగీకరించడంతో ఇద్దరి మధ్య ప్రేమకథ మొదలవుతుంది.
అయితే వీరి ప్రేమ ప్రయాణం సాఫీగా సాగదు. రఘు జీవితంలోకి అప్పులు, ఉద్యోగం కోల్పోవడం వంటి సమస్యలు వస్తాయి. దీంతో కుటుంబానికి దూరమై, జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ పరిణామాలకు అవంతిక ప్రేమ ఎంతవరకు కారణమైంది? ఆమెను వదిలి దుబాయ్ వెళ్లాలనుకున్న రఘు చివరకు పోలీస్‌స్టేషన్‌కు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? జీవితంలో కోల్పోయిన వాటిని రఘు తిరిగి పొందాడా? చివరకు అవంతికతో అతడి ప్రేమకథ ఎలాంటి ముగింపునకు చేరింది? అనేది తెరపై చూడాల్సిందే.
ఎలా ఉందంటే.. ‘లవ్ ఓ లవ్’ నేటితరం ప్రేమకథల్లో కనిపించే ఆకర్షణలు, ఆడంబరాలు, ప్రేమ కోసం చేసే అధిక ఖర్చులు, వాటి వల్ల కుటుంబాలు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులను ప్రధానంగా చూపించింది. రఘు, అవంతిక ప్రేమకథను ఆసక్తికరంగా ప్రారంభిస్తూ.. బైక్, గిఫ్ట్‌లు, సినిమాలు, షికార్ల కోసం రఘు చేసే ఖర్చులను హాస్యభరితంగా తెరకెక్కించారు. ప్రథమార్ధం సరదా సన్నివేశాలతో అలరిస్తుంది. అయితే ద్వితీయార్ధంలో కథనం కాస్త నెమ్మదించి, కొన్ని సన్నివేశాలు రొటీన్‌గా అనిపిస్తాయి. రఘు, అవంతిక మధ్య వచ్చే పరిణామాలు కథను మరో మలుపు తిప్పినా, కొన్ని అంశాలు సహజత్వానికి దూరంగా అనిపిస్తాయి. క్లైమాక్స్‌లో భావోద్వేగాన్ని జోడించి కథను ముగించారు. మొత్తంగా ప్రేమ, హాస్యం, కుటుంబ భావోద్వేగాలతో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేసిన చిత్రమిది.
ఎవరెలా చేశారంటే.. సగటు యువకుడి పాత్రలో పవిష్ సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. ప్రేమ కోసం అప్పులు చేసి ఇబ్బందులు పడే యువకుడిగా తన పాత్రకు చక్కగా న్యాయం చేశాడు. నాగదుర్గ కూడా నేటితరం అమ్మాయి పాత్రలో ఒదిగిపోయి మెప్పించింది. మధ్యతరగతి తండ్రిగా కేఎస్ రవికుమార్, ఇన్‌స్పెక్టర్‌గా సెల్వరాఘవన్, మహిళా మండలి అధ్యక్షురాలిగా వనితా విజయ్‌కుమార్ తమ పాత్రల పరిధిలో అలరించారు. దర్శకుడు మహేశ్ రాజేంద్రన్ ప్రేమ, డబ్బు విలువ, స్నేహం, కుటుంబ బాధ్యతలను మేళవిస్తూ యువతకు కనెక్ట్ అయ్యేలా సినిమాను తెరకెక్కించారు. అయితే ద్వితీయార్ధంపై మరింత శ్రద్ధ పెట్టి, క్లైమాక్స్‌ను ఇంకాస్త బలంగా తీర్చిదిద్దితే సినిమా మరింత మెప్పించేది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















