మారుమూల ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు ప్రాథమిక వైద్య సేవలు అందించేందుకు రూపొందించిన ‘మీ ఇంటికి మీ డాక్టర్’ ప్రాజెక్ట్‌ను గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ప్రారంభించారు. లోక్‌భవన్‌లో జరిగిన ప్రపంచ రెడ్‌క్రాస్, తలసీమియా దినోత్సవ కార్యక్రమంలో ఈ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు.
ఈ ప్రాజెక్ట్ ద్వారా వచ్చే మూడేళ్లలో ఐదు జిల్లాల్లోని సుమారు 5 లక్షల కుటుంబాలకు వారి ఇళ్ల వద్దకే వెళ్లి ఉచిత వైద్య సేవలు, అవసరమైన మందులు అందించనున్నారు. గర్భిణులు, 0–6 సంవత్సరాల పిల్లలు, మంచాన పడిన వృద్ధులకు ప్రత్యేక వైద్య సంరక్షణను అందించనున్నారు.
వైద్యుడు, నర్స్, ఫార్మసిస్ట్, డ్రైవర్‌తో కూడిన మొబైల్ మెడికల్ యూనిట్లను సీఎస్‌ఆర్ నిధుల ద్వారా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ రూ.8.40 కోట్ల సహకారం అందించింది.
రాష్ట్రంలోని పొట్టిశ్రీరాములు నెల్లూరు, పశ్చిమ గోదావరి, బాపట్ల, కృష్ణా, కాకినాడ జిల్లాల కలెక్టర్లు, రెడ్‌క్రాస్ శాఖల సేవలను గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు. తలసీమియా వ్యాధిపై అవగాహన పెంపు, ముందస్తు పరీక్షలు, బాధితులకు సహాయం అందించడమే దినోత్సవ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















