కర్ణాటక రవాణా శాఖ మంత్రి బైరతి సురేష్ బెంగళూరు నగరంలో ఆర్టీసీ బస్సు సేవల పనితీరును స్వయంగా పరిశీలించారు. ప్రయాణికులకు అందుతున్న సేవలు, సిబ్బంది వ్యవహారశైలిని తెలుసుకునేందుకు ఆయన ఎవరూ గుర్తుపట్టకుండా మాస్క్ ధరించి సాధారణ ప్రయాణికుడిలా అర్ధరాత్రి వేళ బస్సుల్లో ప్రయాణించారు.
ఆకస్మిక తనిఖీల్లో భాగంగా పలు మార్గాల్లో తిరిగిన మంత్రి.. బస్సుల్లో ప్రయాణికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది సమయపాలన, టికెట్ జారీ విధానం, ప్రయాణికుల పట్ల వారి ప్రవర్తనను పరిశీలించారు.
ఈ క్రమంలో ఓ బస్సులో ప్రయాణించిన మంత్రి కండక్టర్‌కు రూ.100 ఇచ్చి రెండు టికెట్లు ఇవ్వాలని కోరారు. అయితే కండక్టర్ తన వద్ద చిల్లర లేదని చెబుతూ బ్యాగును చూపించాడు. చిల్లర అందుబాటులో లేకపోతే బస్సు దిగిపోవాలని సూచించడంతో మంత్రి సిబ్బంది తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
మరో ఘటనలో ఓ బస్టాప్ వద్ద ప్రయాణికుడు చేయి చూపించి బస్సును ఆపాలని ప్రయత్నించినా డ్రైవర్ పట్టించుకోకుండా వెళ్లిపోవడాన్ని మంత్రి గమనించారు. ప్రయాణికులకు సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
తనిఖీల అనంతరం విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కండక్టర్, డ్రైవర్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఇలాంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తామని మంత్రి తెలిపారు.
ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరించాలని, టికెట్ జారీ, బస్సుల నిర్వహణ, సమయపాలన వంటి అంశాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మంత్రిగారి ఆకస్మిక తనిఖీ ఘటన కర్ణాటక ఆర్టీసీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















