భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను కామన్వెల్త్ గేమ్స్ 2026లో తన పూర్తి సామర్థ్యంతో పోటీపడబోనని స్పష్టం చేసింది. సెప్టెంబరు 19 నుంచి జరగనున్న ఆసియా క్రీడలపైనే తన దృష్టి మొత్తం ఉందని తెలిపింది. ఆసియా క్రీడల్లో తొలి పతకం సాధించడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొంది. అందుకోసమే కామన్వెల్త్ గేమ్స్‌లో తన శక్తిని పూర్తిగా వినియోగించకుండా జాగ్రత్త పడుతున్నట్లు చెప్పింది.
ఈసారి కామన్వెల్త్ గేమ్స్‌లో 48 కేజీల విభాగంలో బరిలోకి దిగనున్న చాను.. ఆసియా క్రీడలకు సమయం తక్కువగా ఉండటంతో ఎలాంటి రిస్క్ తీసుకోవడం లేదని తెలిపింది. ఆసియా క్రీడల్లో 90 కేజీల స్నాచ్ బరువు ఎత్తేందుకు తప్పకుండా ప్రయత్నిస్తానని వెల్లడించింది. పోటీల్లోకి వచ్చినప్పటి నుంచి 48 లేదా 49 కేజీల బరువును కొనసాగించడం ఎంతో కష్టమని, బరువును నియంత్రించుకోవడానికి అథ్లెట్లు తమ జీవితంలో చాలా సమయం కేటాయించాల్సి ఉంటుందని చెప్పింది.
టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకంతో పాటు రెండు ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతకాలు, కామన్వెల్త్ గేమ్స్‌లో రెండు స్వర్ణాలు, ఒక రజతం సాధించిన మీరాబాయి చాను.. ఆసియా క్రీడల్లో మాత్రం ఇప్పటివరకు పతకం గెలవలేకపోయింది. ఈసారి ఆసియా క్రీడల్లో పతకం సాధించడమే తన ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. లాస్ ఏంజెలెస్ 2028 ఒలింపిక్స్‌కు ముందు బరువు విభాగాల్లో మార్పుల నేపథ్యంలో ఆసియా క్రీడల తర్వాత 53 కేజీల విభాగంలోకి మారే ఆలోచనలో ఉన్నట్లు చాను వెల్లడించింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















