పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ తన సరళతను మరోసారి చాటుకున్నారు. ఝార్‌గ్రామ్‌లో నిర్వహించిన ర్యాలీల మధ్యలో ఆయన అకస్మాత్తుగా రహదారి పక్కన ఉన్న చిన్న దుకాణం వద్ద ఆగి స్థానిక వంటకం ‘ఝాల్‌మురీ’ను రుచి చూశారు. ప్రధాని వాహనాలు ఒక్కసారిగా ఆగడంతో అక్కడి ప్రజలు ఆశ్చర్యంతో గుమిగూడారు.
వాహనం దిగిన మోదీ స్వయంగా దుకాణం వద్దకు వెళ్లి, “భాయ్, నీ ఝాల్‌మురీ తినిపించు… ధరెంత? బాగా తయారు చెయ్” అంటూ సాదాసీదాగా మాట్లాడటం అందరినీ ఆకట్టుకుంది. అకస్మాత్తుగా ప్రధాని తన దుకాణం వద్దకు రావడంతో ఆ వ్యాపారి ఆనందంతో ఉప్పొంగిపోయాడు.
మోదీ డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నించగా, దుకాణదారుడు మొదట నిరాకరించినప్పటికీ, ప్రధాని ఒత్తిడి చేయడంతో చివరకు తీసుకున్నారు. మరమరాల్లో ఏమేమి వేయాలంటూ అడగగా, “ఉప్పు తప్ప అన్నీ వేయ్” అంటూ సరదాగా సమాధానమిచ్చారు. అలాగే “మీరు ఉల్లిపాయలు తింటారా?” అని అడిగిన ప్రశ్నకు, “ఉల్లిపాయలు తింటాను… బుర్ర మాత్రం తినను” అంటూ చమత్కరించడంతో అక్కడ నవ్వులు పూశాయి.ప్రధాని ఈ సరళ, సహజ వ్యవహారం అక్కడి ప్రజలను ఆకట్టుకోవడమే కాకుండా, సామాన్య ప్రజలతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని మరోసారి చూపించింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















