పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం వేడెక్కుతున్న వేళ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మహిళా రిజర్వేషన్ల అంశంపై ప్రధాని దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, రాజకీయ ప్రయోజనాల కోసం అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.మహిళలను కవచంగా ఉపయోగించి పునర్విభజన ప్రక్రియను రుద్దే ప్రయత్నం జరిగిందని, దాన్ని తమ ప్రభుత్వం అడ్డుకుందని ఆమె తెలిపారు. మహిళా రిజర్వేషన్లపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే బిల్లు ఆమోదం పొందిన తరువాత ఎందుకు ఆలస్యం జరిగిందని ప్రశ్నించారు.
రాజకీయాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇచ్చేది తమ తృణమూల్ కాంగ్రెస్ పార్టీనేనని మమత స్పష్టం చేశారు. లోక్‌సభలో తమ పార్టీ ఎంపీలలో 37.9 శాతం మహిళలే ఉన్నారని, రాజ్యసభలో కూడా 46 శాతం మహిళా ప్రతినిధులను పంపినట్టు వెల్లడించారు. మహిళా రిజర్వేషన్లను తమ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకించలేదని, కేవలం పునర్విభజన ప్రక్రియపైనే అభ్యంతరం వ్యక్తం చేశామని చెప్పారు.ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగిస్తూ ప్రధాని మోదీపై ఆమె మరింతగా దాడి చేశారు. ఎన్నికల ప్రచారం కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగిస్తున్నారని విమర్శించారు. పశ్చిమ బెంగాల్‌లోని అన్ని 294 స్థానాలకు తానే అభ్యర్థినని మోదీ చెప్పడాన్ని ఆమె తప్పుబట్టారు. బెంగాల్‌లో పోటీ చేయాలంటే ప్రధాని పదవికి రాజీనామా చేసి, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకుని ఓట్లు అడగాలని సవాల్ విసిరారు.
భాజపా అధికారంలోకి వస్తే తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని ఆమె హెచ్చరించారు. కోల్‌కతాలో ఈడీ దాడులను ప్రస్తావిస్తూ, “ఎలాంటి ఒత్తిడులు వచ్చినా తలవంచను” అని మమత బెనర్జీ స్పష్టం చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder Movies News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews



















