అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందానికి సంబంధించిన చర్చలు కొనసాగుతున్నప్పటికీ అవి ఇంకా కొలిక్కి రాకపోవడానికి ఇరాన్ సుప్రీం లీడర్ Mojtaba Khamenei అందుబాటులో లేకపోవడమే ప్రధాన కారణమని అమెరికా నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం మొజ్తాబా ఖమేనీ రహస్య ప్రదేశంలో ఉంటున్నారని, అధికారులతో నేరుగా మాట్లాడకుండా దూతల ద్వారా మాత్రమే సందేశాలు పంపిస్తున్నట్లు సమాచారం.
అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందానికి సంబంధించిన ఫ్రేమ్‌వర్క్‌ను ఖమేనీ పరిశీలించినట్లు సమాచారం ఉన్నప్పటికీ, ఆయన నుంచి ఇంకా ఎలాంటి తుది స్పందన రాలేదని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఇరాన్‌కు చెందిన సీనియర్ అధికారులు కూడా ఖమేనీని నేరుగా సంప్రదించలేకపోతున్నారని, దీంతో చర్చలు ఆలస్యమవుతున్నాయని పేర్కొన్నాయి.
ఇక టెహ్రాన్‌కు చెందిన పలువురు కీలక నేతలు కూడా వారాల తరబడి బంకర్లలోనే ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా వీరు ప్రత్యక్ష సమావేశాలకు దూరంగా ఉంటున్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైన తొలి రోజే మాజీ సుప్రీం లీడర్ Ali Khamenei మరణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన కుమారుడు మొజ్తాబాను సుప్రీం నేతగా ఎంపిక చేశారు. అయితే, ఇజ్రాయెల్ దాడుల్లో మొజ్తాబా తీవ్రంగా గాయపడినట్లు గతంలో వార్తలు వెలువడగా, వాటిని ఇరాన్ ఖండించింది. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని తెలిపినా, ఇప్పటివరకు మొజ్తాబా బహిరంగంగా కనిపించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
మరోవైపు, Israel నుంచి ఖమేనీ హోదాలో ఎవరున్నా తమ టార్గెట్‌లోనే ఉంటారని హెచ్చరికలు వస్తుండటంతో ఇరాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు Donald Trump హర్మూజ్ జలసంధిపై దిగ్బంధనం కొనసాగుతుందని స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో మధ్యప్రాచ్య పరిస్థితులు మరింత ఉత్కంఠభరితంగా మారాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















