Telanganaలోని సంగారెడ్డి జిల్లాలో వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసుకున్న దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భార్య తన ప్రియుడితో కలిసి అతడిని హత్య చేసి, అనంతరం మృతదేహాన్ని పూడ్చిపెట్టిన సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మనూరు మండల కేంద్రానికి చెందిన కల్పనకు గంగాపూర్‌కు చెందిన ముత్యంరెడ్డి (35)తో 13 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కల్పన నారాయణఖేడ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుండగా, ముత్యంరెడ్డి బోరు మోటార్ల మెకానిక్‌గా జీవనం సాగిస్తున్నాడు.
ఈ క్రమంలో కల్పనకు మనూరు మండలం ఎల్గోయి గ్రామానికి చెందిన పండరితో పరిచయం ఏర్పడి, అది తర్వాత వివాహేతర సంబంధానికి దారితీసింది. తమ సంబంధానికి ముత్యంరెడ్డి అడ్డుగా ఉన్నాడని భావించిన ఇద్దరూ అతడిని హత్య చేయాలని పథకం రచించారు.ఈ నెల 17వ తేదీ రాత్రి ముత్యంరెడ్డికి మద్యం తాగించి, నారాయణఖేడ్‌లోని ఓ దాబా సమీపంలో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం జేసీబీ సహాయంతో మృతదేహాన్ని సమీప ప్రాంతంలో పూడ్చిపెట్టారు.
తర్వాత భర్త కనిపించడం లేదంటూ కల్పన ఈ నెల 18న నారాయణఖేడ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్‌కాల్స్ ట్రేస్ చేయగా అనుమానాలు బలపడటంతో కల్పన, పండరిలను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో వారు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.మనూరు తహసీల్దార్ విష్ణుసాగర్ సమక్షంలో ఆదివారం మృతదేహాన్ని వెలికితీసి, అది ముత్యంరెడ్డిదేనని గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















