భారత్‌తో వాణిజ్య ఘర్షణకు దిగే ఉద్దేశం అమెరికాకు ఏమాత్రం లేదని అమెరికా విదేశాంగశాఖ మంత్రి Marco Rubio స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు Donald Trump అమలు చేస్తున్న వాణిజ్య విధానాలు ఏ దేశానికీ వ్యతిరేకంగా కాకుండా, ప్రపంచంతో అమెరికా చేస్తున్న వాణిజ్యాన్ని సమతుల్యం చేయడానికేనని ఆయన తెలిపారు.
దిల్లీలో భారత విదేశాంగశాఖ మంత్రి S. Jaishankarతో జరిగిన ద్వైపాక్షిక చర్చల అనంతరం ఇద్దరు నేతలు సంయుక్తంగా విలేకరులతో మాట్లాడారు. భారత్‌తో వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయాలని అమెరికా సంకల్పంతో ఉందని రూబియో వెల్లడించారు.భారత్ భారీ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని, అమెరికా కూడా ప్రధాన వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్యంలో ఉన్న అసమతౌల్యాలను సరిచేసి, ఇరు దేశాలకు లాభదాయకంగా ఉండే విధంగా కొత్త ఒప్పందం రూపొందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. త్వరలోనే అమెరికా వాణిజ్య ప్రతినిధి భారత్‌కు రానున్నట్లు కూడా వెల్లడించారు.
చైనా, పాకిస్థాన్‌లతో అమెరికా సంబంధాలపై వచ్చిన ప్రశ్నలకు సమాధానంగా రూబియో మాట్లాడుతూ.. భారత్‌తో ఉన్న వ్యూహాత్మక బంధాన్ని పణంగా పెట్టే విధంగా అమెరికా ఎప్పటికీ వ్యవహరించదని స్పష్టం చేశారు. భారత్‌తో సంబంధాలు మరింత బలపడే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.ఇదే సమయంలో మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన తుది ముసాయిదా త్వరలో సిద్ధమవుతుందని జైశంకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. చట్టబద్ధ వలసలకు రక్షణ కల్పించాలని అమెరికాను కోరినట్లు వెల్లడించారు. వీసా, వలసలపై ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులపై కూడా చర్చ జరిగినట్లు తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















