రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ తన తొలి నెల వేతనాన్ని దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలకు విరాళంగా అందించి గొప్ప మనసు చాటుకున్నారు. ఎంపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తనకు అందిన తొలి నెల జీతం రూ.3 లక్షలను సైనికుల కుటుంబాల సంక్షేమం కోసం అందించారు.
ఈ మేరకు విరాళానికి సంబంధించిన చెక్కును కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు విజయ్ స్వయంగా అందజేశారు. దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తున్న సైనికుల కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని విజయ్ పేర్కొన్నారు.
దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల కుటుంబాలకు తన వంతు సహాయం అందించాలనే ఉద్దేశంతోనే తొలి వేతనాన్ని విరాళంగా ఇచ్చినట్లు తెలిపారు. పదవి చేపట్టిన వెంటనే తొలి జీతాన్ని సైనికుల కుటుంబాల సంక్షేమానికి కేటాయించడం పట్ల పలువురు విజయ్‌ను అభినందిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















