గ్రామాల్లో స్వచ్ఛరథాలు విప్లవాత్మక మార్పు తెస్తున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. చెత్త నుంచి సంపద సృష్టి అనే యజ్ఞంలో ప్రజలను భాగస్వామ్యం చేశామని గుర్తుచేసుకున్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణను స్వచ్ఛరథాలు సులభతరం చేశాయన్నారు. స్వచ్ఛ రథాలపై ప్రజల్లో అవగాహన కోసం తన వంతు సాయం చేసిన హీరో నానికి పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో 19 లక్షల కేజీల పొడి చెత్త కొనుగోలు చేశామని వెల్లడించారు. రూ. 3.32 కోట్ల విలువ గల నిత్యావసరాలను ప్రజలకు అందించామన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య ఉద్యమం పట్ల ప్రజల్లో అవగాహనకు ఇదే నిదర్శనమని కొనియడారు. పొడి చెత్తకు బదులుగా పుస్తకాలు, స్టేషనరీ వస్తువులు ఇవ్వడం సత్ఫలితాలను ఇస్తున్నాయని హర్షం వ్యక్తంచేశారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యాలను సాధించే క్రమంలోనే ‘స్వచ్ఛ రథాలు’ ప్రారంభించినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















