నేషనల్ బుక్ ట్రస్ట్ (ఎన్‌బీటీ) ఇండియా, దిల్లీలోని ప్రధాన కార్యాలయ పరిధిలో తాత్కాలిక ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 11 పోస్టులను భర్తీ చేయనున్నారు.
కన్సల్టెంట్ గ్రేడ్-2, కన్సల్టెంట్ గ్రేడ్-1, లిటరరీ ఫెస్టివల్ క్యూరేటర్, కల్చరల్ క్యూరేటర్, కంటెంట్ రైటర్, యంగ్ ప్రొఫెషనల్, ఎమ్‌సీ, హిందీ అధికారి, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అడ్మిన్ ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.
పోస్టును బట్టి డిగ్రీ లేదా పీజీతో పాటు సంబంధిత ఉద్యోగానుభవం ఉండాలి. వయసు పోస్టును బట్టి 32 నుంచి 65 ఏళ్లలోపు ఉండాలి. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.30,000 నుంచి రూ.2,00,000 వరకు వేతనం అందుతుంది.
అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అర్హులైన వారు సెప్టెంబరు 10లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలను ఎన్‌బీటీ అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















