జాతీయ విద్య, పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) తొమ్మిదో తరగతి పాఠ్యపుస్తకంలో కీలక మార్పులు చేసింది. రాజ్యాంగాన్ని పరిచయం చేసే అధ్యాయం నుంచి రాజ్యాంగ పీఠికను తొలగించడం, అలాగే సెక్యులర్ (లౌకిక), సెక్యులరిజం (లౌకిక వాదం) వంటి ప్రస్తావనలను తొలగించడం ప్రధాన మార్పులుగా పేర్కొంటున్నారు.
జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) ఆధారంగా సవరించిన సాంఘిక శాస్త్ర పుస్తకంలో ఓటర్ల జాబితా–ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను కొత్త పాఠ్యాంశంగా చేర్చారు. ఈ ప్రక్రియ ద్వారా లక్షలాది మంది యువ ఓటర్లు ఎన్నికల జాబితాలో చేరినట్లు ‘అండర్‌స్టాండింగ్ సొసైటీ: ఇండియా అండ్ బియాండ్’ అనే అధ్యాయంలో వివరించారు. నకిలీ వార్తలు, తప్పుడు సమాచారం, బెదిరింపులు వంటి సవాళ్లు ఉన్నప్పటికీ భారత ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తోందని పుస్తకంలో ప్రశంసించారు.
అదే విధంగా ‘స్టేట్ అండ్ సొసైటీ అప్ టు 1000 సీఈ’ అనే అధ్యాయంలో వేద నాగరికతలో మహిళలకు ఉన్న స్థానం గురించి ప్రస్తావన ఉంది. అంతేకాకుండా మనుస్మృతిలో పేర్కొన్న సరైన జీవన విధానం, సామాజిక వ్యవస్థలు, పాలనకు సంబంధించిన అంశాలను సూచించే ఒక పద్యాన్ని కూడా చేర్చారు.
గతంలో ఎనిమిదో తరగతి పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థపై అవినీతి అంశాన్ని చేర్చినప్పుడు సుప్రీంకోర్టు విమర్శలు చేసిన నేపథ్యంలో, తాజా 9వ తరగతి పుస్తకంలో న్యాయవ్యవస్థను నిష్పక్షపాతంగా, స్వతంత్ర సంస్థగా అభివర్ణించడం గమనార్హం.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















