ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు భారత్‌ను ప్రబల శక్తిగా అభివర్ణించారు. ఇతర దేశాల్లో తమ దేశ చట్టబద్ధతకు విఘాతం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, భారత్ మాత్రం ఇజ్రాయెల్ పట్ల అవ్యాజ ప్రేమ చూపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
జోర్డాన్ వ్యాలీలో జరిగిన ఒక నాయకత్వ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ విషయాలు వెల్లడించారు. ఇజ్రాయెల్ అంతర్జాతీయ సంబంధాలు, దౌత్య భాగస్వామ్యాల విస్తరణలో భారత్ ఒక కీలక ఉదాహరణగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు.
ప్రపంచంలో మరెక్కడా లేనంతమంది అభిమానులు తనకు భారత్‌లో ఉన్నారని కూడా నెతన్యాహు వ్యాఖ్యానించారు. భారత్‌తో ఉన్న బంధం ఇజ్రాయెల్‌కు అత్యంత ముఖ్యమైనదని, భవిష్యత్తులో ఈ సంబంధాలు మరింత బలపడతాయని ఆయన సూచించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















