ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, భౌగోళిక రాజకీయ అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న వేళ నెదర్లాండ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా, కెనడాల్లో నిల్వ చేసిన 86 టన్నుల బంగారాన్ని లండన్‌కు తరలించి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో భద్రపరిచింది. బిలియన్ డాలర్ల విలువైన ఈ బంగారం తరలింపు ప్రక్రియను కొన్ని నెలలపాటు వివిధ దశల్లో నిర్వహించినట్లు డచ్ సెంట్రల్ బ్యాంక్ (DNB) వెల్లడించింది.
ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్టు మధ్య అమెరికా, కెనడా బ్యాంకుల నుంచి తొలుత 27 టన్నుల బంగారాన్ని నెదర్లాండ్స్‌కు తరలించారు. అక్కడి నుంచి దాన్ని లండన్‌లోని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌కు చేర్చారు. మిగిలిన బంగారాన్ని న్యూయార్క్‌లో విక్రయించి.. అదే మొత్తంలో లండన్‌లో తిరిగి కొనుగోలు చేసినట్లు డచ్ సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.
బంగారం తరలింపు సమయంలో ఎదురయ్యే ప్రమాదాలు, రవాణా సంబంధిత సవాళ్లను పరిగణనలోకి తీసుకుని ఈ క్లిష్టమైన ప్రక్రియను వివిధ దశల్లో పూర్తి చేసినట్లు DNB పేర్కొంది.
అంతర్జాతీయంగా అస్థిర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలోనే బంగారాన్ని లండన్‌కు తరలించినట్లు నెదర్లాండ్స్ కేంద్ర బ్యాంకు తెలిపింది. లండన్‌లో బంగారాన్ని కొనుగోలు చేయడం, విక్రయించడం, తాకట్టు పెట్టడం సులభంగా ఉంటుందని.. సంక్షోభ పరిస్థితుల్లో అవసరమైనప్పుడు బంగారాన్ని వేగంగా ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొంది.
ప్రస్తుతం అమెరికా-కెనడా మధ్య వాణిజ్య వివాదాలు, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు వంటి పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో నెదర్లాండ్స్ బంగారం నిల్వల విషయంలో తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
లండన్ ప్రపంచంలోని ప్రధాన బంగారం ట్రేడింగ్ కేంద్రాల్లో ఒకటి. ఇక్కడ బంగారాన్ని కొనుగోలు చేయడం, విక్రయించడం, తాకట్టు పెట్టడం సులభంగా ఉంటుంది. అంతేకాకుండా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ప్రపంచంలోని పలు దేశాల బంగారం నిల్వలను అత్యంత భద్రంగా సంరక్షిస్తోంది.
థ్రెడ్‌నీడిల్ స్ట్రీట్‌లోని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాల్ట్ అత్యంత పటిష్ఠమైన భద్రతా వ్యవస్థతో నిర్మించారు. ప్రపంచంలోని భారీ బంగారం నిల్వల్లో గణనీయమైన భాగం ఇక్కడ భద్రపరచబడుతోంది.
ముఖ్యంగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో బంగారం నిల్వ ఉంచడం వల్ల దేశాల మధ్య లావాదేవీలు, బంగారం బదిలీలు మరింత సులభంగా జరుగుతాయి. ఒక దేశానికి కేటాయించిన వాల్ట్ నుంచి మరో దేశానికి కేటాయించిన వాల్ట్‌లోకి బంగారు కడ్డీలను మార్చడం ద్వారా బదిలీ ప్రక్రియ పూర్తవుతుంది. దీంతో భౌతికంగా బంగారాన్ని మరో దేశానికి తరలించాల్సిన అవసరం ఉండదు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















