పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర రూపం దాల్చాయి. ఇరాన్‌పై అమెరికా మంగళవారం రాత్రి వైమానిక దాడులు చేసింది. దక్షిణ ఇరాన్‌లోని సిరిక్‌లో ఓ వివాహ వేడుకపై దాడి జరగడంతో నలుగురు మృతిచెందగా.. పలువురు గాయపడినట్లు సమాచారం.
పశ్చిమాసియాలోని తమ సైనికులను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటోందని, హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులకు ప్రయత్నిస్తోందని అమెరికా సెంట్రల్ కమాండ్ ఆరోపించింది. ఈ కారణంగానే ఇరాన్‌పై దాడులు చేసినట్లు తెలిపింది.
అమెరికా చర్యలకు ప్రతిగా ఇరాన్ కూడా బహ్రెయిన్, కువైట్, జోర్డాన్‌లపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు పేర్కొంది. మరోవైపు హర్మూజ్ జలసంధిలో సముద్ర మందుపాతరలను తాకడంతో రెండు చమురు ట్యాంకర్లలో పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ తెలిపింది. అమెరికాపై మరింత వినూత్నంగా దాడులు చేస్తామని హెచ్చరించింది.
హర్మూజ్ జలసంధి పూర్తిగా తమ నియంత్రణలో ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. దాని పేరును ‘ట్రంప్ జలసంధి’గా మార్చుదాం అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
తాము చేపడుతున్న దాడులకు ఇరాన్ ప్రతిదాడులు చేస్తే.. ఆ దేశంపై మరింత తీవ్రంగా విరుచుకుపడతామని ట్రంప్ హెచ్చరించారు. దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















