ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (EESL) ఇప్పుడు రెండు విడతల్లో సుమారు 5 లక్షల ఇండక్షన్ స్టవ్‌ల సరఫరాకు కొత్త టెండర్లు పిలవడానికి యోచిస్తోంది.
ఇప్పటికే, పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా వంటగ్యాస్ (LPG) సరఫరాపై ప్రభావం ఏర్పడటంతో, విద్యుత్ ఆధారిత వంట ఉపకరణాలపై వినియోగదారుల డిమాండ్ పెరిగింది. దీని నేపథ్యంలో, మార్కెట్లో అధిక గిరాకీను తీర్చేందుకు, ఈఈఎస్ఎల్ ఇటీవలే లక్షల ఇండక్షన్ స్టవ్‌లకు టెండర్ ప్రక్రియ పూర్తి చేసింది.
వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు మరియు వినియోగదారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, ఇండక్షన్ ఆధారిత వంట సామగ్రి కోసం టెండర్ ప్రక్రియను నిర్వహించినట్లు సంస్థ తెలిపింది.
అధికారిక వర్గాల ప్రకారం, ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో వినియోగదారుల అధిక స్పందనను దృష్టిలో ఉంచుకుని, దాదాపు 5 లక్షల ఇండక్షన్ స్టవ్‌ల సరఫరాకు కొత్త టెండర్లు పిలవాలని ఈఈఎస్ఎల్ నిర్ణయించిందని వెల్లడించారు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APGovernment APNews APPolitics Breaking news BreakingNews Business BusinessNews ChandrababuNaidu CricketFans CricketNews CrimeNews Entertainment Geopolitics Government India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates SportsNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews ViralNews WorldNews



















