భారత్–అమెరికా ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాల ముఖ్య సంధానకర్తలు ఈ నెల 20 నుంచి వాషింగ్టన్‌లో మూడు రోజుల పాటు చర్చలు జరపనున్నారు. ఫిబ్రవరిలో ఒప్పందం తుదిరూపు పొందినప్పటికీ, తాజా టారిఫ్ మార్పుల నేపథ్యంలో తిరిగి సమీక్ష అవసరమవుతోందని వాణిజ్య కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ తెలిపారు.
ఈ చర్చల్లో భారత బృందానికి ముఖ్య సంధానకర్తగా దర్పన్ జైన్ పాల్గొననున్నారు. దాదాపు 3–4 నెలల విరామం తర్వాత ఇరు దేశాల బృందాలు ప్రత్యక్షంగా సమావేశమవుతున్నాయి. చట్టబద్ధ ఒప్పందానికి తుదిరూపు ఇవ్వడమే లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.
అమెరికా ప్రారంభించిన సెక్షన్ 301 దర్యాప్తుపై కూడా ఈ సమావేశాల్లో చర్చలు జరగనున్నాయి. ఈ వివాదాన్ని ఎలా పరిష్కరించాలనే అంశంపై ఇరు వర్గాలు ఏకాభిప్రాయానికి రావాలని ప్రయత్నించనున్నాయి.
భారత్‌పై టారిఫ్‌లను 18 శాతానికి తగ్గించేందుకు గతంలో ఒప్పందం కుదిరినా, అమెరికా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో వాణిజ్య ఒప్పందంలో సవరణలు అవసరమయ్యాయని అధికారులు చెబుతున్నారు.ఇక భారత్–బ్రిటన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వచ్చే నెల నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని రాజేశ్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు.
Andhra pradesh Andhrapradesh APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder Movies News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews



















