ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ట్రోలింగ్‌ చేసిన సినిమానే హిట్‌.. రూ.లక్ష పెట్టుబడికి రూ.20 కోట్ల వసూళ్లు

August 18, 2026
in Movies, News
0
ట్రోలింగ్‌ చేసిన సినిమానే హిట్‌.. రూ.లక్ష పెట్టుబడికి రూ.20 కోట్ల వసూళ్లు

ట్రోలింగ్‌ చేసిన సినిమానే హిట్‌.. రూ.లక్ష పెట్టుబడికి రూ.20 కోట్ల వసూళ్లు

Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధారణంగా ఓ సినిమా విజయం సాధించాలంటే మంచి కథ, ఆకట్టుకునే నటీనటులు, అద్భుతమైన విజువల్స్‌, భారీ బడ్జెట్‌తో పాటు ప్రచారం కూడా కీలకంగా మారుతుంది. అయితే.. చైనాలో విడుదలైన ఓ యానిమేషన్‌ సినిమా మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా నిలిచింది. భారీగా ప్రచారం చేయకపోయినా.. నాణ్యతపై దారుణమైన విమర్శలు, సోషల్‌మీడియాలో వచ్చిన ట్రోల్స్‌ ఈ సినిమాకు అనూహ్యంగా కలిసొచ్చాయి. చివరకు అదే ట్రోలింగ్‌ సినిమాకు ఉచిత ప్రచారంగా మారి బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు వచ్చేలా చేసింది.

ఆగస్టు 5న చైనాలో విడుదలైన ఈ చిత్రమే ‘న్యూ లాయ్‌’ (Niu Lai). తెలుగులో దీని అర్థం ‘ఆవు వస్తోంది’ అని. దాదాపు 86 నిమిషాల నిడివి ఉన్న ఈ యానిమేషన్‌ సినిమాలో ఓ లేగదూడ, పిచ్చుక చుట్టూ సాగే విచిత్రమైన కలల ప్రపంచాన్ని చూపించినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాను భారీ నిర్మాణ సంస్థలు రూపొందించలేదు. తల్లీకొడుకు కలిసి సుమారు ఐదేళ్లపాటు కష్టపడి సినిమాను రూపొందించినట్లు ప్రచారంలో ఉంది. కథ, రచన, దర్శకత్వం, డబ్బింగ్‌, ప్రొడక్షన్‌ తదితర పనులను వారిద్దరే నిర్వహించినట్లు సమాచారం. మొత్తం సినిమాను తెరకెక్కించేందుకు దాదాపు రూ.లక్ష మాత్రమే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

అయితే.. థియేటర్లలోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఆశించిన దానికి పూర్తి భిన్నంగా మారింది. విడుదలైన తొలి పది రోజుల్లో చైనా వ్యాప్తంగా కేవలం 300 మంది మాత్రమే ఈ సినిమాకు టికెట్లు కొనుగోలు చేశారు. దీంతో 7,700 యువాన్లకు పైగా.. అంటే మన కరెన్సీలో సుమారు రూ.1.04 లక్షలు మాత్రమే వసూలయ్యాయి. పెట్టిన డబ్బు దాదాపు తిరిగి వచ్చినా.. సినిమా విజయవంతమవుతుందని ఎవరూ ఊహించలేదు.

సినిమా చూసిన కొందరు ప్రేక్షకులు దాని యానిమేషన్‌, గ్రాఫిక్స్‌, సన్నివేశాలపై తీవ్ర విమర్శలు చేశారు. 2026లో వచ్చిన అత్యంత చెత్త సినిమాల్లో ఇదొకటంటూ సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టారు. కొందరు అయితే ‘దీని కంటే ఏఐతో మెరుగైన వీడియో చేయొచ్చు’ అంటూ కామెంట్లు చేశారు.

అయితే ఈ విమర్శలే సినిమాకు ఊహించని ప్రచారాన్ని తెచ్చిపెట్టాయి. సినిమాలోని కొన్ని సన్నివేశాలు, గ్రాఫిక్స్‌కు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో విపరీతంగా షేర్‌ అయ్యాయి. వాటిపై నెటిజన్లు మీమ్స్‌ తయారు చేశారు. ఫలితంగా సినిమా పేరు ఒక్కసారిగా ఎక్కువ మందికి తెలిసింది.

ట్రోల్స్‌, మీమ్స్‌ వైరల్‌ కావడంతో చాలామందిలో ఆసక్తి మొదలైంది. ‘అసలు ఈ సినిమాలో అంత చెత్తగా ఏముంది?’ అనే ఉత్సుకతతో కొందరు థియేటర్లకు వెళ్లడం ప్రారంభించారు. ఇలా సినిమా చూడాలనే ఆసక్తి పెరిగేకొద్దీ థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య కూడా పెరిగింది.

సాధారణంగా ప్రతికూల ప్రచారం సినిమాకు నష్టం చేస్తుందని భావిస్తాం. కానీ ‘న్యూ లాయ్‌’ విషయంలో మాత్రం ఇదే ప్రతికూల ప్రచారం పాజిటివ్‌ బాక్సాఫీస్‌ ఫలితంగా మారింది. సినిమా బాగుందనే ప్రచారానికి బదులుగా.. ‘ఇంత చెత్తగా ఉందట.. ఎలా ఉందో మనమే చూద్దాం’ అనే ఆసక్తి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది.

ప్రస్తుతం ఈ చిత్రం చైనా బాక్సాఫీస్‌ వద్ద 14.9 మిలియన్‌ యువాన్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం. మన కరెన్సీలో ఈ మొత్తం సుమారు రూ.20 కోట్లకు సమానం. కేవలం రూ.లక్ష బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాకు ఇది భారీ మొత్తమే.

అంతేకాదు.. చైనాలో విడుదలైన కొన్ని భారీ హాలీవుడ్‌ చిత్రాల కలెక్షన్లతోనూ ఈ చిన్న సినిమా పోటీ పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొదట్లో కేవలం 300 మంది ప్రేక్షకులతో ప్రారంభమైన సినిమా.. ఇప్పుడు కోట్ల రూపాయల వసూళ్లు సాధించడం సినీ వర్గాలను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

మొత్తంగా ‘న్యూ లాయ్‌’ కథ సినిమా విజయానికి కొత్త కోణాన్ని చూపించింది. మంచి సినిమా అంటూ వచ్చే ప్రచారం మాత్రమే కాదు.. ‘చెత్త సినిమా’ అనే ట్రోలింగ్‌ కూడా ఒక్కోసారి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచి బాక్సాఫీస్‌ విజయానికి దారితీయవచ్చని ఈ చిత్రం నిరూపించింది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: Animation MovieBox Office CollectionsChina Box OfficeChinese AnimationCinemaHollywood MoviesMovie TrollingMoviesNiu Laishivasakthimediashivasakthinewssocial mediaViral Movie
ShareTweetSend
Previous Post

హుస్సేన్‌సాగర్‌కు మహర్దశ.. సరికొత్త రూపంలో లేక్‌ఫ్రంట్‌

Next Post

విద్యార్థుల నిరసనల్లో పోలీసు చర్యపై విచారణ.. హైపవర్డ్‌ కమిటీ ఏర్పాటు: సుప్రీంకోర్టు

Related Posts

తల్లిదండ్రుల హత్య కేసులో బెయిల్‌పై వచ్చిన నర్సు ఆత్మహత్య
Crime News

తల్లిదండ్రుల హత్య కేసులో బెయిల్‌పై వచ్చిన నర్సు ఆత్మహత్య

August 25, 2026
టాక్సిక్‌’కు టికెట్‌ రేట్లు పెంపు.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల అనుమతి
Movies

‘టాక్సిక్‌’కు టికెట్‌ రేట్లు పెంపు.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల అనుమతి

August 25, 2026
కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణమయ్యే ఆహారాలివే.. తెలుసుకోండి
Health

కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణమయ్యే ఆహారాలివే.. తెలుసుకోండి

August 25, 2026
తక్కువ ధరకే బోల్ట్‌ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు
Business News

తక్కువ ధరకే బోల్ట్‌ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు

August 25, 2026
పీరియడ్స్‌లో జలుబు, తలనొప్పి, అలసట.. అసలు కారణమేంటి?
Health

పీరియడ్స్‌లో జలుబు, తలనొప్పి, అలసట.. అసలు కారణమేంటి?

August 25, 2026
ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగంపై మళ్లీ నాన్చివేత
Telangana News

ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగంపై మళ్లీ నాన్చివేత

August 25, 2026
Next Post
విద్యార్థుల నిరసనల్లో పోలీసు చర్యపై విచారణ.. హైపవర్డ్‌ కమిటీ ఏర్పాటు: సుప్రీంకోర్టు

విద్యార్థుల నిరసనల్లో పోలీసు చర్యపై విచారణ.. హైపవర్డ్‌ కమిటీ ఏర్పాటు: సుప్రీంకోర్టు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 25, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 25, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 25 ఆగస్టు 2026 (మంగళవారం)

పంచాంగం: 25 ఆగస్టు 2026 (మంగళవారం)

August 25, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
టాక్సిక్‌’కు టికెట్‌ రేట్లు పెంపు.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల అనుమతి

‘టాక్సిక్‌’కు టికెట్‌ రేట్లు పెంపు.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల అనుమతి

August 25, 2026
కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణమయ్యే ఆహారాలివే.. తెలుసుకోండి

కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణమయ్యే ఆహారాలివే.. తెలుసుకోండి

August 25, 2026
తక్కువ ధరకే బోల్ట్‌ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు

తక్కువ ధరకే బోల్ట్‌ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు

August 25, 2026
పీరియడ్స్‌లో జలుబు, తలనొప్పి, అలసట.. అసలు కారణమేంటి?

పీరియడ్స్‌లో జలుబు, తలనొప్పి, అలసట.. అసలు కారణమేంటి?

August 25, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

టాక్సిక్‌’కు టికెట్‌ రేట్లు పెంపు.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల అనుమతి

‘టాక్సిక్‌’కు టికెట్‌ రేట్లు పెంపు.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల అనుమతి

August 25, 2026
కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణమయ్యే ఆహారాలివే.. తెలుసుకోండి

కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణమయ్యే ఆహారాలివే.. తెలుసుకోండి

August 25, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.