భారత్‌లో నిఫా వైరస్ (Nipah Virus) పరిస్థితిపై ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల ఇద్దరికి నిఫా వైరస్ సోకడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై వ్యాప్తిని అరికట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది.
నిఫా వ్యాప్తిపై భయంతో చైనా, థాయ్‌లాండ్, నేపాల్, మలేసియా, తైవాన్ వంటి దేశాలు భారతీయ ప్రయాణికులకు స్క్రీనింగ్ పరీక్షలు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో స్పందించిన WHO, భారత్‌లో నిఫా ప్రభావం తక్కువగానే ఉందని, దీనితో ప్రపంచానికి పెద్ద ప్రమాదం ఏమీ లేదని స్పష్టం చేసింది.
నిఫా వైరస్ ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాపిస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని WHO తెలిపింది. అలాగే, ఈ కారణంగా భారత్‌పై ప్రయాణ లేదా వాణిజ్య పరిమితులు విధించాల్సిన అవసరం లేదని ప్రపంచ దేశాలకు సూచించింది.
భారత ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, నిఫా బారిన పడిన ఇద్దరు వ్యక్తులు ఎలాంటి ప్రయాణాలు చేయలేదని, అందువల్ల ఇతర రాష్ట్రాలకు వైరస్ వ్యాప్తి చెందే అవకాశం తక్కువేనని WHO పేర్కొంది. వైరస్ నియంత్రణకు భారత్ వేగవంతమైన చర్యలు తీసుకుంటోందని ప్రశంసించింది.
ఇదిలా ఉండగా, పొరుగుదేశం చైనా అప్రమత్తమై, భారత్ సహా ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ ప్రక్రియను ప్రారంభించింది. అయితే ఇప్పటివరకు తమ దేశంలో నిఫా కేసులు నమోదు కాలేదని చైనా వ్యాధి నియంత్రణ కేంద్రం వెల్లడించింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















